కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన బాధిత యువతి
సాక్షి, లక్నో : యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు తనను లైంగికంగా వేధించాడని బాధిత మహిళ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ యూపీలోని షహజన్‌పూర్ కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితురాలు ధర్నాకు దిగారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, ఉన్నావ్, కథువా లైంగిక దాడి ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో తాజా ఉదంతం వెలుగుచూడటం గమనార్హం.
ఉన్నావ్‌లో 2017, జూన్‌లో ఉద్యోగం కోసం బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఇంటికి వచ్చిన తనపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వద్ద బాధితురాలు సహా ఆమె కుటుంబ సభ్యులు సజీవ దహనానికి యత్నించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. అనంతరం పోలీస్ కస్టడీలో బాధితురాలి తండ్రి మరణించడం దుమారం రేపింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఆయన శరీరంపై తీవ్ర గాయాలున్నట్టు వెల్లడైంది. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలపై ఎట్టకేలకు సీబీఐ బీజేపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment