up bjp
-
బీజేపీలోకి ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’?
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఆరు, ఏడు దశల పోలింగ్ ఇంకా జరగాల్సి ఉంది. అయితే ఇంతలో యూపీకి సంబంధించిన ఒక వార్త హల్చల్ చేస్తోంది. నాటి బీఎస్పీ ప్రభుత్వంలో మాజీ సీఎం మాయావతికి అత్యంత సన్నిహితునిగా మెలిగిన అధికారులలో ఒకరైన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ప్రేమ్ ప్రకాష్ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.ప్రేమ్ ప్రకాష్ విధుల నిర్వహిస్తున్న సమయంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరొందారు. కాన్పూర్ జోన్లో ఆయన విధులు నిర్వహిస్తున్న సమయంలో 67 మంది నిందితులను అరెస్టు చేశారు. 2019లో కాన్పూర్‌లో జరిగిన సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో కూడా ప్రేమ్ ప్రకాష్ ముఖ్యమైన పాత్ర పోషించారు. మూడేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీని పంజాబ్‌లోని రోపర్ జైలు నుంచి యూపీలోని బండా జైలుకు తీసుకురావాల్సి న బాధ్యతను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది.ఢిల్లీ నివాసి అయిన ప్రేమ్ ప్రకాష్ 1993 బ్యాచ్ అధికారి. బీటెక్ తర్వాత పోలీస్ మేనేజ్మెంట్లో ఎండీ కోర్సు చేసిన ప్రేమ్ ప్రకాష్ ఆగ్రా, మొరాదాబాద్లలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. ఆయన 2009లో లక్నో డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగ జీవితంలో ఆయన పలు అవార్డులు అందుకున్నారు. -
జోరుగా క్రాస్ ఓటింగ్
బెంగళూరు/లఖ్‌నవూ/సిమ్లా/న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో జోరుగా క్రాస్ ఓటింగు సాగింది. దాంతో సంఖ్యాబలం ప్రకారం 8 స్థానాలు నెగ్గాల్సిన బీజేపీ మరో రెండు చోట్ల అనూహ్య విజయం సాధించింది! యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి, హిమాచల్‌ప్రదేశ్‌లో పాలక కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చింది. ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు గాను 41 చోట్ల ఎన్నిక ఇప్పటికే ఏకగ్రీవం కావడం తెలిసిందే. యూపీలో 10, కర్ణాటకలో 4, హిమాచల్‌లో ఒకటి చొప్పున మిగతా 15 స్థానాలకు మంగళవారం ఓటింగ్ జరిగింది. అసెంబ్లీల్లో సంఖ్యాబలం మేరకు యూపీలో బీజేపీ 7, ఎస్పీ 3; కర్ణాటకలో కాంగ్రెస్ 3, బీజేపీ 1; హిమాచల్‌లో ఏకైక స్థానంలో కాంగ్రెస్ గెలవాల్సి ఉంది. కానీ బీజేపీ హిమాచల్‌లో పోటీకి దిగడమే గాక యూపీలో 8వ అభ్యర్థిని రంగంలోకి దించింది. కర్ణాటకలో కూడా ముగ్గురు కాంగ్రెస్, ఒక బీజేపీ అభ్యర్థితో పాటు దాని మిత్రపక్షం జేడీ(ఎస్) నుంచి ఐదో అభ్యర్థీ పోటీకి దిగారు. యూపీలో ఏడుగురు ఎస్పీ, ఒక బీఎస్పీ ఎమ్మెల్యేలు; హిమాచల్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. దాంతో హిమాచల్‌లోని ఏకైక సీటుతో పాటు యూపీలో 8వ రాజ్యసభ స్థానమూ బీజేపీ కైవసమయ్యాయి. కర్ణాటకలో మాత్రం బీజేపీ ఎత్తులు పారలేదు. సంఖ్యాబలానికి అనుగుణంగా కాంగ్రెస్ 3, బీజేపీ ఒక స్థానంలో నెగ్గాయి. అయితే ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేయడమే గాక మరొకరు ఓటింగ్‌కు దూరంగా ఉండి పార్టీకి షాకిచ్చారు! మూడు పార్టీలూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్యలకు తమ సిద్ధమవుతున్నాయి! హిమాచల్‌లో టాస్ హిమాచల్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలకు గాను పాలక కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీకి 25 మందే ఉన్నారు. అయితే ముగ్గురు స్వతంత్రులతో పాటు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థి హర్‡్ష మహాజన్‌కు ఓటేశారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి అనుహ్య ఓటమి చవిచూశారు. అభ్యర్థులిద్దరికీ సమానంగా చెరో 34 ఓట్లు రావడంతో టాస్ ద్వారా హర్‡్షను విజేతను తేల్చారు. ఇక యూపీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ మనోజ్ పాండే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నిర్వహించిన సమావేశానికి ఆయనతో పాటు మరో ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వీరిలో కనీసం ఏడుగురు బీజేపీకి అనుకూలంగా ఓటేసినట్టు తేలింది. ఒక బీఎస్పీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి ఓటేశారు. దాంతో ఆ పార్టీ అభ్యర్థులు ఆర్పీఎన్ సింగ్, తేజ్‌వీర్‌సింగ్, అమర్‌పాల్ మౌర్య, సంగీతా బల్వంత్, సుధాన్షు త్రివేది, సాధనాసింగ్, నవీన్ జైన్, సంజయ్ సేథ్ విజయం సాధించారు. సమాజ్‌వాదీ నుంచి జయాబచ్చన్, రాంజీలాల్ సుమన్ నెగ్గగా అలోక్ రంజన్ ఓటమి పాలయ్యారు. కర్ణాటకలో మాత్రం ఊహించిన ఫలితాలే దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థి నారాయణ కె.బాండే గెలుపొందగా జేడీ(యూ) అభ్యర్థి కుపేంద్రరెడ్డి ఓటమి చవిచూశారు. అయితే యశవంతపుర బీజేపీ ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయగా యల్లాపుర బీజేపీ ఎమ్మెల్యే శివరాం హెబ్బార్ పోలింగ్‌కు దూరంగా ఉన్నారు! వారిద్దరూ కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారిపై చర్యలకు బీజేపీ సిద్ధమైంది. క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో హిమాచల్‌లో సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కారు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వాలను కూల్చేయడం మోదీ సర్కారుకు అలవాటుగా మారిందంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. -
KSR కామెంట్ : తెలంగాణ లో యూపీ తరహా పాలన తెస్తామంటున్న కమలం
-
ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు సంక్షేమ పథకాలు బంద్ : యూపీ
-
‘హోటల్లో నిర్బంధించి లైంగిక దాడి’
బదోహి : యూపీలోని బదోహిలో ఓ హోటల్లో నిర్బంధించి బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠి మరో ఆరుగురు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించారు. 2007లో భర్తను కోల్పోయిన బాధితురాలు ఎమ్మెల్యే త్రిపాఠి మేనల్లుడని 2014లో కలవగా అప్పటి నుంచి వివాహం చేసుకుంటానంటూ ఎమ్మెల్యే ఆయన బంధువులు లైంగికంగా వేధించారని మహిళ పేర్కొన్నారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే మేనల్లుడు తనను బదోహిలోని ఓ హాటల్లో నిర్బంధించి ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళ వివరించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసును జిల్లా ఏఎస్పీకి అప్పగించామని పోలీసు అధికారులు వెల్లడించారు. చదవండి : ఆశ చూపి అత్యాచారం -
యోగి టీంలో చోటు వీరికే..
సాక్షి, లక్నో : ఉప ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవడంతో ఉత్తర ప్రదేశ్ పార్టీ యంత్రాంగంలో భారీ మార్పులకు బీజేపీ సన్నద్ధమైంది. పార్టీ, ప్రభుత్వ పదవుల నియామకాల్లో సమతూకం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు సంఘ్ పరివార్‌తో సమన్వయంతో పనిచేయాలని బీజేపీ అగ్రనాయకత్వం సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు సూచించింది. అధికారుల ప్రమేయాన్ని తగ్గించి పార్టీ నేతల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా విస్పష్ట సంకేతాలు పంపినట్టు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గస్థాయి వరకూ పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు పెద్దపీట వేసేలా చర్యలు చేపట్టాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశించిందని వెల్లడించాయి. మారిన సంస్థాగత నిర్మాణంలో పార్టీ విస్తారక్‌లు కీలక భూమిక పోషిస్తారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. మరోవైపు త్వరలో చేపట్టనున్న యూపీ క్యాబినెట్ విస్తరణలో సంఘ్ పరివార్ నేపథ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. జులై రెండో వారంలోగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. కైరానా లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎదురైన పరాజయం నేపథ్యంలో అధికారిక నియామకాల్లో సమతూకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. కాగా యూపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సునీల్ బన్సల్ పనితీరుపై యూపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కేంద్ర నాయకత్వం కొద్దిరోజుల పాటు యూపీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఇన్‌చార్జ్‌లు సునీల్ బన్సల్, శివ్ప్రకాష్లకు సూచించినట్టు సమాచారం. ఇక బన్సల్‌తో విభేదాల కారణంగా పార్టీ యూపీ వ్యవహరాల ఇన్చార్జ్ ఓపీ మాధుర్ సైతం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.పార్టీ శ్రేణుల్లో నెలకొన్న విభేదాలు, అసంతృప్తిని పారదోలేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీ నేతలు, కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
వివాదంలో మరో బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, లక్నో : యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు తనను లైంగికంగా వేధించాడని బాధిత మహిళ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ యూపీలోని షహజన్‌పూర్ కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితురాలు ధర్నాకు దిగారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, ఉన్నావ్, కథువా లైంగిక దాడి ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో తాజా ఉదంతం వెలుగుచూడటం గమనార్హం. ఉన్నావ్‌లో 2017, జూన్‌లో ఉద్యోగం కోసం బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఇంటికి వచ్చిన తనపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వద్ద బాధితురాలు సహా ఆమె కుటుంబ సభ్యులు సజీవ దహనానికి యత్నించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. అనంతరం పోలీస్ కస్టడీలో బాధితురాలి తండ్రి మరణించడం దుమారం రేపింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఆయన శరీరంపై తీవ్ర గాయాలున్నట్టు వెల్లడైంది. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలపై ఎట్టకేలకు సీబీఐ బీజేపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసింది. -
బీజేపీ గూటికి ఇద్దరు ఎమ్మెల్యేలు
లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు శుక్రవారం బీజేపీలోకి చేరారు. యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే శ్యామ్ ప్రకాష్ కాషాయం కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర నాయకులు కూడా బీజేపీలో చేరారు. వీరిరాకతో పార్టీ మరింత బలోపేతమవుతుందని మౌర్య చెప్పారు. బీఎస్పీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఇటీవల బీజేపీలో చేరారు. వీరితో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీ గూటికి చేరారు. -
సీఎం మాటల మనిషే.. చేతల మనిషి కాదు: బీజేపీ
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, ఆమె మంత్రులు వివిధ ప్రాజెక్టుల పేరుతో ఖజానాను ఖాళీ చేశారని చెబుతున్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. అవినీతి గురించి కేవలం కబుర్లు చెబుతున్నారు తప్ప దాన్ని అరికట్టేందుకు ఏమీ చేయడం లేదని బీజేపీ విమర్శించింది. ముఖ్యమంత్రి నిజంగానే అవినీతిపై గట్టిగా వ్యవహరించాలని అనుకుంటే, అవినీతిపరులైన మాజీ మంత్రులపై చర్యలు తీసుకునేవారని.. కానీ నాటి లోకాయుక్త జస్టిస్ ఎన్కే మెహ్రోత్రా గట్టిగా చెప్పినా బీఎస్పీ మంత్రులపై ఎలాంటి చర్యలు లేవని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ అన్నారు. అవినీతి విషయంలో సమాజ్‌వాదీ, బీఎస్పీల మధ్య రహస్య అవగాహన ఉందని, అందువల్లే ముఖ్యమంత్రి కేవలం మాటలు చెప్పి ఊరుకుంటున్నారు తప్ప చేతల జోలికి పోవడం లేదని ఆయన ఆరోపించారు. 'నువ్వు నన్ను రక్షిస్తే నేను నిన్ను రక్షిస్తా' అని ఇద్దరూ ఊరుకుంటున్నారని చెప్పారు. బీఎస్పీ ప్రభుత్వం చేసిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని సమాజ్‌వాదీ ప్రభుత్వం ఓ కమిటీ వేసిందని, దాని సంగతి ఏమైందని కూడా పాఠక్ ప్రశ్నించారు.