
బీజేపీ గూటికి ఇద్దరు ఎమ్మెల్యేలు
లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు శుక్రవారం బీజేపీలోకి చేరారు. యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే శ్యామ్ ప్రకాష్ కాషాయం కండువా కప్పుకున్నారు.
వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర నాయకులు కూడా బీజేపీలో చేరారు. వీరిరాకతో పార్టీ మరింత బలోపేతమవుతుందని మౌర్య చెప్పారు. బీఎస్పీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఇటీవల బీజేపీలో చేరారు. వీరితో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీ గూటికి చేరారు.