బదోహి : యూపీలోని బదోహిలో ఓ హోటల్‌లో నిర్బంధించి బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠి మరో ఆరుగురు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించారు. 2007లో భర్తను కోల్పోయిన బాధితురాలు ఎమ్మెల్యే త్రిపాఠి మేనల్లుడని 2014లో కలవగా అప్పటి నుంచి వివాహం చేసుకుంటానంటూ ఎమ్మెల్యే ఆయన బంధువులు లైంగికంగా వేధించారని మహిళ పేర్కొన్నారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే మేనల్లుడు తనను బదోహిలోని ఓ హాటల్‌లో నిర్బంధించి ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళ వివరించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసును జిల్లా ఏఎస్పీకి అప్పగించామని పోలీసు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment