ట్రంప్‌ పర్యటన: విందుకు అది కూడా వచ్చింది! | AR Rahman Shares Video Little Friend At Trumps Dinner | Sakshi
Sakshi News home page

మీకు తెలుసా? ఇది కూడా విందుకు వచ్చింది

Published Fri, Feb 28 2020 12:36 PM | Last Updated on Fri, Feb 28 2020 3:11 PM

AR Rahman Shares Video Little Friend At Trumps Dinner - Sakshi

రెండు రోజులు పర్యటన నిమిత్తం దేశానికి వచ్చిన అగ్రారాజ్యాధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు భారత ప్రభుత్వం ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ విందులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, సీఎం కేసీఆర్‌ సహా ఆరు రాష్ట్రాల సీఎంలు, భారత్‌-అమెరికాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితోపాటు ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇక ట్రంప్‌ మాంసాహార ప్రియుడైనప్పటికీ ప్రభుత్వం వెజిటేరియన్‌ మెనూకే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. (రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులకు విందు)

ఇదిలా ఉండగా విందులో అంతమంది ఉంటే రెహమాన్‌ మాత్రం ఒకరిపైనే దృష్టి సారించాడు. పైగా అది భోజనం చేస్తున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా వీడియో తీశాడు. ‘మా చిట్టిపొట్టి స్నేహితుడు కూడా విందుకు వచ్చేశాడు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇంతకీ వచ్చిందెవరనుకుంటున్నారు.. ఓ కోతి. అది అక్కడి పూలకుండీలోని ఆకులను తింటుండగా వీడియో క్లిక్‌మనిపించాడు. దీంతో రెహమాన్‌ హాస్యచతురతకు మెచ్చిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘మీ దోస్తు భలేగుంది’, ‘ట్రంప్‌, మోదీతోపాటు మరో ముఖ్య అతిథితో విందారగించారు, నిజంగా మీరు గ్రేట్‌’ ‘శాఖాహార వంటకాలున్నాయని తెలిసి వచ్చింది కాబోలు’ అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు. (ట్రంప్‌ రాకతో ఒరిగిందేంటి?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement