ఎన్కౌంటర్లో ముగ్గురు హతం | Army kills three intruders in Kashmir | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్లో ముగ్గురు హతం

Published Mon, Jul 13 2015 10:07 AM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

ఎన్కౌంటర్లో ముగ్గురు హతం - Sakshi

ఎన్కౌంటర్లో ముగ్గురు హతం

శ్రీనగర్:  జమ్మూ,కశ్మీర్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. సైన్యానికి,  వేర్పాటువాద గెరిల్లాలలకు మధ్య జరిగిన పోరులో ముగ్గురు హతమయ్యారు.  లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర  అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు చొరబాటుదార్లను సైన్యం హతమార్చిందని  భద్రతావర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం అనుమానాస్పదంగా కనిపించిన టెర్రరిస్టులను  నిఘావర్గాలు అడ్డగించి ప్రశ్నించాయి.

దీంతో వారు కాల్పులకు  దిగారు.  ఈ నేపథ్యంలో సైన్యానికి, గెరిల్లాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.  కొన్ని గంటల పాటు కొనసాగిన ఈ ఎన్కౌంటర్ లో   భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మూడు ఏకె 47  రైఫిల్స్, 12 ఏకే మాగ్జైన్స్ను,  సుమారు మూడు వందల రౌండ్ల  బుల్లెట్లు, రెండు  అండర్ బ్యారెల్ గ్రెనైడ్ లాంచర్లను  స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం అధికార వర్గాలు వెల్లడించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement