ప్రసాదం తిని 100 మందికి అస్వస్థత
బిహార్‌లోని మాధేపురా జిల్లాలో గల సాహుగఢ్ జానకి అనే గ్రామంలో ప్రసాదం తిన్న సుమారు వంద మంది అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో పదిమంది పిల్లలు కూడా ఉన్నారు. ప్రసాదం తిన్నవాళ్లందరికీ వాంతులు, తల తిరగడం, కడుపు నొప్పి లాంటి లక్షణాలు కనిపించాయని, దాంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించామని జిల్లా కలెక్టర్ మహ్మద్ సొహైల్ తెలిపారు.
అందరికీ ముప్పు తప్పిందని, ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఇలా జరిగి ఉంటుందని ఆయన అన్నారు. స్థానికులు ఎనిమిది రోజుల పాటు 'అష్ట్యమ' పూజ చేశారు. అందులో మొదటి రోజు తయారుచేసిన ప్రసాదాన్ని అంతా తిన్నారు. దానివల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.