మద్యం కనిపిస్తే.. సీఎంను అరెస్టు చేయండి | arrest chief minister if liquor is found anywhere in the state, says union minister ram vilas pashwan | Sakshi
Sakshi News home page

మద్యం కనిపిస్తే.. సీఎంను అరెస్టు చేయండి

Published Sat, Oct 8 2016 10:24 AM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

మద్యం కనిపిస్తే.. సీఎంను అరెస్టు చేయండి - Sakshi

మద్యం కనిపిస్తే.. సీఎంను అరెస్టు చేయండి

బిహార్‌లో మద్య నిషేధం కోసం సరికొత్త చట్టాన్ని తెచ్చినందున.. ఇక మీదట రాష్ట్రంలో ఎక్కడైనా మద్యం కనిపిస్తే సీఎం నితీష్‌కుమార్‌ను అరెస్టుచేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. మద్యాన్ని నిషేధిస్తూ ఏప్రిల్ 5న చేసిన చట్టాన్ని పట్నా హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో.. నితీష్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించిన విషయం తెలిసిందే. దాంతో ఈ అంశంపై తాజాగా పాశ్వాన్ స్పందించారు. ఇంట్లో ఎక్కడైనా మద్యం కనిపిస్తే ఆ కుటుంబంలోని పెద్దలందరినీ జైలుకు పంపిస్తామని ఈ కొత్త చట్టంలో ఉందని, అందువల్ల రాష్ట్రంలో ఎక్కడైనా మద్యం కనిపిస్తే ముఖ్యమంత్రిని కూడా అరెస్టు చేసి ఆయనను జైలుకు పంపాలని అన్నారు.

రాష్ట్రంలో మద్యనిషేధానికి తమ పార్టీ లో్క్‌జనశక్తి కూడా అనుకూలమేనని, అయితే కొత్త మద్యనిషేధ చట్టంలో పెట్టిన కొన్ని నిబంధనలను మాత్రం తాము వ్యతిరేకిస్తున్నామని పాశ్వాన్ అన్నారు. ఇంట్లో మద్యం కనిపిస్తే కుటుంబ పెద్దలను అరెస్టుచేయడం లాంటి నిబంధనలపైనే ఆయన వ్యాఖ్యానించారు. ఇక బాలికపై అత్యాచారం కేసులో్ నిందితుడైన ఎమ్మెల్యే రాజ్‌ వల్లభ్ యాదవ్‌ను కలిసిన ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ మీద కూడా పాశ్వాన్ మండిపడ్డారు. బెయిల్‌ మీద బయటకు వచ్చిన ఎమ్మెల్యేకు లాలు మద్దతు ఇవ్వడం సరికాదని, ఆయనను మళ్లీ జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement