సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనావైరస్ సోకలేదని పరీక్షల్లో తేలింది. గత మూడు రోజులుగా గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్న సీఎం కేజ్రీవాల్‌కు మంగళవారం ఉదయం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం వచ్చిన రిపోర్ట్‌లో సీఎంకు కరోనా నెగెటివ్ వచ్చినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చధా ట్వీటర్ ద్వారా వెల్లడించారు. (చదవండి : కరోనా: ఢిల్లీ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం)
కాగా, కరోనా లక్షణాలతో బాధపడుతున్న సీఎం కేజ్రీవాల్ ఆదివారం నుంచి స్వీయనిర్బంధంలో ఉన్నారు. అన్ని అధికారిక, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మంగళవారం ఉదయం ఆయనకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నివేదికలో నెగెటివ్‌గా తేలడంతో అధికార యంత్రాంగం, కేజ్రీవాల్ కుటుంబం ఊపిరిపీల్చుకుంది.(చదవండి : కేజ్రీవాల్ వింత నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment