అసమానతలు ఉన్నంత వరకూ రిజర్వేషన్లు: భాగవత్ As long as inequalities reservations: Bhagawath | Sakshi
Sakshi News home page

అసమానతలు ఉన్నంత వరకూ రిజర్వేషన్లు: భాగవత్

Published Mon, Sep 8 2014 1:39 AM

అసమానతలు ఉన్నంత వరకూ రిజర్వేషన్లు: భాగవత్

న్యూఢిల్లీ: సమాజంలో అసమానతలు, వివక్ష కొనసాగుతున్నంత కాలం రిజర్వేషన్లు అవసరమేనని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. అయితే ఈ రిజర్వేషన్ల కోటా విషయంలో రాజకీయాలు తగవని వ్యాఖ్యానించారు. ఆదివారం భాగవత్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

‘‘మేం రిజర్వేషన్లను సమర్థిస్తాం. సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు అవసరమే. అసమానత, వివక్షలతో బాధపడుతున్నవారు సమాన అవకాశాలు పొందడానికి రిజర్వేషన్లు అవకాశం కనిపిస్తాయి. కానీ, ఈ విషయంలో రాజకీయాలు ఏ మాత్రం తగవు’’ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement