అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం ..30మంది మృతి | Assam accident: At least 26 killed and 8 injured as bus plunges into gorge | Sakshi
Sakshi News home page

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం ..30మంది మృతి

Published Wed, Jun 15 2016 3:31 PM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

Assam accident: At least 26 killed and 8 injured as bus plunges into gorge

అసోం: రాష్ట్రంలోని సోనాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది.  సిల్చార్ నుండి గౌహతి ప్రయాణిస్తూ మంగళవారం రాత్రి పొద్దుపోయాక తూర్పు జైంతియా హిల్స్  దగ్గర అదుపు త‌ప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.   లోతైన లోయలో పడిపోవడంతో 30 మంది మృతి చెందారు, మరికొంతమంది గాయపడ్డారు. 95 శాతం మంది ప్రయాణీకులు మరణించినట్టు ఐఎన్ఎస్ తెలిపింది.సుమారు 500  అడుగుల కిందికి పడిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టుతెలుస్తోంది. బీఎస్ఎఫ్ ,   పోలీసు యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యల్ని కొనసాగిస్తోంది.  గాయపడ్డ వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో  స్థానిక యువకులు సహాయచర్యల్లో పాల్గొంటున్నారు.  ఈ ప్రదేశంలో రాత్రి పూట ఇలాంటి  ప్రమాదం  చోటు చేసుకోవడం ఇదే మొదటి సారని జిల్లా ఎస్పీ  తెలిపారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement