గువాహటి: భారత్‌లో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే ఈశాన్య భారతంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడి అసోంలో ఇప్పటి వరకు దాదాపు 15 వేల పందులు మృత్యువాతపడ్డాయి. ఫిబ్రవరిలో ఇక్కడ తొలి స్వైన్ ఫీవర్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అది కాస్తా క్రమంగా తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పందులను సామూహికంగా చంపేందుకు స్థానిక ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కేవలం వైరస్ సోకిన పందులను మాత్రమే చంపాలని నిర్ణయించింది. ఇక వ్యాధి బారిన పడి చనిపోయిన పందులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. (వైరస్‌లను తరిమికొట్టే కోటింగ్ సృష్టి )
పందులను పెంచే రైతులకు ఒకే విడతలో రూ.144 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించాలని కేంద్రాన్ని కోరింది. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న ఈ సంక్షోభం కారణంగా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అసోం పశు సంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. రోజురోజుకీ పందుల మరణాలు పెరుతున్నాయని, ప్రస్తుతం వైరస్ ప్రభావం పది జిల్లాలకు సోకిందని పేర్కొన్నారు. ఇప్పటికే 14,919 పందులు చనిపోయాయని, వీటి సంఖ్య మరింత పెరుగుతోందన్నారు. ఈ క్రమంలో పరిస్థితిని కేంద్రానికి వివరించి అప్రమత్తం చేశామని తెలిపారు మరోవైపు బాధిత పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. (మాస్కు ఉల్లంఘన: హైదరాబాద్ టాప్ )
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది జంతువులకు సోకే వైరస్. ఇది మనుషులకు వ్యాప్తి చెందదు. ఒక జంతువు నుంచి ఇతర జంతువులకు సోకే ఈ వైరస్ భారత్‌లో వ్యాపించడం ఇదే మొదటిసారి. చైనా నుంచి ఈ వ్యాధి వచ్చినట్లు అసోం పేర్కింది. ఇది ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా వ్యాపించింది. (దేశంలో మరో వైరస్.. ఇది కూడా చైనా నుంచే!)
Comments
Please login to add a commentAdd a comment