కేజ్రీవాల్ ర్యాలీలో మోదీ భజన
ఈ ర్యాలీలో కొన్ని గ్రూపుల ప్రత్యేకంగా మోదీ నామస్మరణ చేశాయి. ఆప్ ఇస్తున్న నినాదాలు కాకుండా వారికి నచ్చిన విధంగా మోదీ నినాదాలు చేశారు. అయితే, ఆ నినాదాలు విని చిర్రెత్తిపోయిన కేజ్రీవాల్.. ఇంటిపన్నును మొత్తానికే రద్దు చేస్తే తాను కూడా మోదీ.. మోదీ అని భజన చేస్తానని అన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తే తాను కూడా మోదీ మోదీ అని భజన చేస్తానని తెలిపారు. 'మోదీ.. మోదీ అని భజన చేసినంత మాత్రానా ఆకలి తీరదు. కొంతమందికి పిచ్చివాళ్లుగా మారారు' అని కేజ్రీవాల్ మండిపడ్డారు.