delhi municipal polls
-
చిన్న పార్టీకి.. పెద్ద పార్టీ భయపడుతోంది
న్యూఢిల్లీ: తమ పార్టీని చూసి బీజేపీ భయపడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. కమలనాథులకు ధైర్యం ఉంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తమపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... ‘వారు చేస్తున్న నాటకాలను దేశం సహించదు. తాము (బీజేపీ) ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పారు. మేము (ఆప్) చాలా చిన్నవాళ్లం. అయినప్పటికీ, వారు భయపడుతున్నారు! చిన్న పార్టీకి పెద్ద పార్టీ భయపడుతోంది. ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాల’ని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ పనితీరును లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రశంసించారని అసెంబ్లీ వెలుపల మీడియాతో చెప్పారు. ఢిల్లీ జీఎస్డీపీ(స్థూల రాష్ట్ర జాతీయ ఉత్పత్తి) ఏ రాష్ట్రంలో లేనంతగా 50 శాతం పెరిగిందన్నారు. పాఠశాలల్లో అనేక కొత్త కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. నీరు, రహదారులు, కాలుష్యం సహా కొన్ని సమస్యల పరిష్కారానికి పని చేయాల్సి ఉందని కేజ్రీవాల్ అన్నారు. (క్లిక్: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా రాజీనామా) -
ఆప్ గాలిబుడగేనా!
► రాజకీయ పార్టీగా అస్తిత్వాన్ని కోల్పోతుందంటున్న నిపుణులు ► ఇతర రాష్ట్రాలపై దృష్టిపెట్టి.. ఢిల్లీని విస్మరించటమూ కారణమే న్యూఢిల్లీ: తాజా ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటం.. అధికారంలో ఉన్న ఆప్ దారుణంగా ఓడిపోవటం కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. తన జోరు గాలిబుడగేనని నిరూపించగా.. మోదీ హవాలో బీజేపీ ఘన విజయం సాధించిందని విశ్లేషకులంటున్నారు. ఈ ఓటమితో ఆప్ ఒక రాజకీయ పార్టీగా తన అస్తిత్వాన్ని కాపాడుకునే అవకాశాలను జారవిడుచుకుంటోందని అభిప్రాయపడుతున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఆప్ స్కోరుకార్డు అంత దారుణంగా ఏమీ లేదు. కానీ మోదీ హవాలో బీజేపీ మరిన్ని ఓట్లు సంపాదించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే. కానీ ఈ ఓటమి ఆప్‌కు చాలా నష్టం చేస్తుంది’ అని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ డైరెక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. ‘గత ఎన్నికల్లో ఆప్ విజయం గాలిబుడగే’నని తేలిందని ఢిల్లీ వర్సిటీ రాజకీయ పరిశోధక విద్యార్థి కుమార్ రాజేశ్ తెలిపారు. మోదీ హవాపై వ్యూహం మార్చుకోకుండా పాత పద్ధతిలోనే ముందుకెళ్లటం, ఢిల్లీలో తాము చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లేబదులు.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఆప్ నాయకత్వం పెద్ద పీట వేయటమూ ఆప్ ఓటమికి కారణంగా భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉన్న మూడు ఢిల్లీ మునిసిపాలిటీల్లో బీజేపీ పాగా వేయటం అంత సులభంగా జరిగిందేం కాదు. వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు వాడిన ఫార్ములానే ఢిల్లీలోనూ బీజేపీ అమలుచేసింది. ఢిల్లీలోని మూడు మునిసిపాలిటీల్లో బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్లను పక్కనపెట్టి అన్నిచోట్లా కొత్తవారిని రంగంలోకి దించి ఘనవిజయాన్నందుకుంది. అంతేకాదు, ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ.. రాజ్‌నాథ్, వెంకయ్య, ఉమాభారతి, స్మృతి ఇరానీ వంటి స్టార్ ప్రచారకర్తలను ఢిల్లీ ప్రచారంలో మోహరించింది. ఒడిశాలో జరిగిన కీలకమైన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సైతం వీరిని దూరంపెట్టి ప్రచారం చేయించారు. పార్టీ చీఫ్ అమిత్‌షా కూడా ఈ ఎన్నికలపై రోజువారీ సమీక్షలు నిర్వహించారు. ఢిల్లీ కాంగ్రెస్ కీలకనేతలైన లవ్లీసింగ్, బర్ఖా శుక్లా సింగ్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరటం కూడా పార్టీకి కలిసొచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఇచ్చిన హామీల వైఫల్యాన్ని బీజేపీ పదేపదే ప్రస్తావించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని పదే పదే చెప్పటం ద్వారా ఢిల్లీలో నివాసముండే పూర్వాంచల్ ప్రజల ఓట్లనూ రాబట్టుకుంది. -
కేజ్రీవాల్ ర్యాలీలో మోదీ భజన
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిత్తరపోయారు. ఆయన ఏర్పాటుచేసిన సభలో ప్రధాని నరేంద్రమోదీకి జయజయధ్వానాలు హోరెత్తడంతోపాటు, మోదీ భజన మొదలవ్వడంతో అవాక్కయ్యారు. త్వరలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉత్తర ఢిల్లీలోని గోండా, గౌతమ్ విహార్ చౌక్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కొన్ని గ్రూపుల ప్రత్యేకంగా మోదీ నామస్మరణ చేశాయి. ఆప్ ఇస్తున్న నినాదాలు కాకుండా వారికి నచ్చిన విధంగా మోదీ నినాదాలు చేశారు. అయితే, ఆ నినాదాలు విని చిర్రెత్తిపోయిన కేజ్రీవాల్.. ఇంటిపన్నును మొత్తానికే రద్దు చేస్తే తాను కూడా మోదీ.. మోదీ అని భజన చేస్తానని అన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తే తాను కూడా మోదీ మోదీ అని భజన చేస్తానని తెలిపారు. 'మోదీ.. మోదీ అని భజన చేసినంత మాత్రానా ఆకలి తీరదు. కొంతమందికి పిచ్చివాళ్లుగా మారారు' అని కేజ్రీవాల్ మండిపడ్డారు. -
మున్సిపల్ ఎన్నికల బరిలో స్వరాజ్ ఇండియా!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఎన్నికల రాజకీయాల్లోకి అరంగ్రేటం చేయాలని యోగేంద్రయాదవ్ నేతృత్వంలోని స్వరాజ్ ఇండియా పార్టీ యోచిస్తోంది. త్వరలో జరగనున్న గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికలో పోటీ చేయాలా? వద్దా అనే విషయంపై పార్టీ త్వరలో ఒక నిర్ణయం తీసుకోనుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అనుపమ్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 2 న ప్రారంభమైన స్వరాజ్ ఇండియా పార్టీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కోసం అజిత్ ఝా నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.