న్యూఢిల్లీ: తమ పార్టీని చూసి బీజేపీ భయపడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. కమలనాథులకు ధైర్యం ఉంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తమపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.
గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... ‘వారు చేస్తున్న నాటకాలను దేశం సహించదు. తాము (బీజేపీ) ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పారు. మేము (ఆప్) చాలా చిన్నవాళ్లం. అయినప్పటికీ, వారు భయపడుతున్నారు! చిన్న పార్టీకి పెద్ద పార్టీ భయపడుతోంది. ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాల’ని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రభుత్వ పనితీరును లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రశంసించారని అసెంబ్లీ వెలుపల మీడియాతో చెప్పారు. ఢిల్లీ జీఎస్‌డీపీ(స్థూల రాష్ట్ర జాతీయ ఉత్పత్తి) ఏ రాష్ట్రంలో లేనంతగా 50 శాతం పెరిగిందన్నారు. పాఠశాలల్లో అనేక కొత్త కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. నీరు, రహదారులు, కాలుష్యం సహా కొన్ని సమస్యల పరిష్కారానికి పని చేయాల్సి ఉందని కేజ్రీవాల్ అన్నారు. (క్లిక్: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా రాజీనామా)
Comments
Please login to add a commentAdd a comment