
కొరాపుట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థి
జయపురం : కొరాపుట్ జిల్లా సయపుర సబ్‌డివిజన్ పరిధి బొయిపరిగుడ గ్రామంలో గల కళాశాలలో సోమవారం ఊహించని సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఒక విద్యార్థి తోటి విద్యార్థిపై కత్తితో దాడి చేయడంతో కళాశాలలో భయానక వాతావరణం నెలకొంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని మొదట జయపురం ప్రభుత్వ సబ్‌డివిజన్ హాస్పిటల్‌కు తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వెంటనే కొరాపుట్ సహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.
వివరాలిలా ఉన్నాయి. జయపురం సమితిలోని అంబాగుడ గ్రామానికి చెందిన విద్యార్థులు జయరాం డాలి, విజయ ఖొశ్లాలు బొయిపరిగుడ కళాశాలలో +2 చదువుతున్నారు. సోమవారం ఈ ఇద్దరు కలిసి ఒక సైకిల్‌పై కళాశాలకు వెళ్లారు. ఆ సమయంలో వారి మధ్య ఏదో విషయంపై వివాదం రేగింది. దీంతో కోపోద్రిక్తుడైన వియజ ఖొర కోపంతో జయరాం తలపై ఒక మారణాయుధంతో బాదాడు. ఈ సంఘటనతో కళాశాలలో భయాందోళన చోటుచేసుకుంది.
కళాశాల బయట జరిగిన ఈ సంఘటనపై కళాశాల అధికారులు పోలీసులకు తెలుపగా బొయిపరిగుడ పోలీసులు వచ్చి గాయపడిన జయరాం ను వెంటనే జయపురం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడినుంచి కొరాపుట్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై బొయిపరిగుడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిత్రులైన ఆ విద్యార్థుల మధ్య ఏం జరిగింది? వారి మధ్య ఎందుకు వివాదం ఏర్పడిందన్నది కళాశాల విద్యార్థుల మధ్య తీవ్ర చర్చనీయంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment