జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్లలో నాలుగో దశ పోలింగ్ ప్రారంభం
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభకు నాలుగో విడత పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 182 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాలుగో దశ ఎన్నికలు కాశ్మీర్ వ్యాలీలోని శ్రీనగర్, అనంతనాగ్, సోపియాన్ జిల్లాలతోపాటు జమ్మూ ప్రాంతంలోని సాంబా జిల్లాలో జరుగుతున్నాయి.
అలాగే జార్ఖండ్లో ఈ రోజు నాలుగో విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 217 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అదృష్టం పరీక్షించుకుంటున్నవారిలో మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ, మరో ముగ్గురు మంత్రులు ఉన్నారు. బొకారలో అత్యధికంగా 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.