న్యూఢిల్లీ: సాంకేతికత, ఉమ్మడి సేవా కేంద్రాల(సీఎస్‌సీ) సహాయంతో దేశంలోని అన్ని గ్రామాల్లో బ్యాంకింగ్ సర్వీసులను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని టెక్నాలజీ, కమ్యూనికేషన్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సీఎస్‌సీల కింద పనిచేస్తున్న గ్రామస్థాయి మహిళా పారిశ్రామికవేత్తల(వీఎల్‌ఈ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే సీఎస్‌సీల ద్వారా నగదు తీసుకునే అవకాశం ఉంది.
తొందరలోనే ఈ కేంద్రాల్లో అకౌంట్ తెరిచే సదుపాయాన్ని కూడా ప్రారంభించనున్నామని ఆయన వివరించారు. పాన్‌కార్డులు, పాస్‌పోర్టులు, రైల్‌టికెట్ల ద్వారా వీఎల్‌ఈలు రూ. 438 కోట్లు సంపాదిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన కల అయిన స్టార్టప్ విప్లవంలో వీఎల్‌ఈలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం, లబ్ధిదారులకు మధ్య సమన్వయానికి, అవినీతి, జాప్యం తగ్గించడానికి సీఎస్‌సీలు ప్రధానంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు.
ప్రతీ గ్రామంలో ‘బ్యాంకింగ్’
Published Sun, Feb 21 2016 1:08 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
Advertisement