షోలాపూర్, న్యూస్‌లైన్: పట్టణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంప్రదాయ దుస్తులతో అందమైన బతుకమ్మలతో బాలికలు, మహిళలు, యువతులు పాటలతో వాడ వాడల సందడి చేస్తున్నారు. విభిన్న నృత్యాలు, పాటలు, పలకరింపులు, ఆనందోత్సాహాలతో ఆకట్టుకుంటున్నారు. సోమవారం సాయంత్రం బిట్లా పాఠశాలలో జరిగిన బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశాలి శిక్షణ సంస్థ ట్రస్టు సులోచన గుండు, సంగీతా ఇందాపూరే, శ్రీనివాస్ కటుకూర్, హరీష్ కొండా, శ్రీధర్ చిట్యాల్, రమేష్ విడప్‌లు హాజరయ్యారు. అలాగే బిట్లా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ నోరా, టీచర్లు శారద గోరంట్యాల్, అనిల్ గంజి, గీతా సాదులు, మధుకర్ మరగనేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శారదా గోరంట్యాల్ బతుకు పాట బతుకమ్మ ఆటగా వివరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తెలిపే ప్రతి పండుగను ఘనంగా జరుపుకొంటూ మన గొప్పతనాన్ని చాటి చెప్పాలన్నారు.
అలాగే గొంగడి బస్తి, దత్తు నగర్, సాకర్ పేట్, ఆంధ్రబద్రావతి పేట్, నీలం నగర్, విడప్ నగర్, కొత్త, పాత గురుకుల ఏరియాలలో రోజువారీగా, వాడవాడల్లో అలాగే శరన్నవరాత్రుల కోసం ఏర్పాటు చేసిన దేవి మండపాల ముందు బతుకమ్మ ఆటలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
Published Tue, Sep 30 2014 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement