ఫారెస్టు గార్డును చంపేసిన ఎలుగుబంటి | Bear Kills Forest Guard in Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఫారెస్టు గార్డును చంపేసిన ఎలుగుబంటి

Published Mon, Jan 5 2015 4:49 PM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

ఫారెస్టు గార్డును చంపేసిన ఎలుగుబంటి

ఫారెస్టు గార్డును చంపేసిన ఎలుగుబంటి

ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో ఓ ఎలుగుబంటి ఫారెస్టు గార్డును చంపేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా రికార్డయింది. ఈ దారుణ ఘటన డిసెంబర్ 21వ తేదీన జరిగింది. దాన్ని ఎవరో ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. సూరజ్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన ఆడ ఎలుగుబంటి.. ముందుగా ఓ స్థానికుడిని చంపేసింది.

అటవీ సిబ్బంది దాన్ని అడవిలోకి తరిమేయాలని ప్రయత్నించారు. అయితే, ఆ బృందంలో ఉన్న ఓ ఫారెస్టు గార్డు మీద ఆ ఎలుగుబంటి దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన గార్డు మరణించాడు. ఆ తర్వాత ఎలుగుబంటిని అటవీశాఖ సిబ్బంది, స్థానిక పోలీసులు కలిసి మళ్లీ అడవిలోకి తరిమేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement