బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి కాల్చివేత | Bihar BJP Vice President Visheswar Ojha shot dead | Sakshi
Sakshi News home page

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి కాల్చివేత

Published Fri, Feb 12 2016 7:30 PM | Last Updated on Fri, Mar 29 2019 5:33 PM

ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని మోదీతో బిహార్ బీజేపీ ఉపాధ్యక్షుడు ఓఝా - Sakshi

ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని మోదీతో బిహార్ బీజేపీ ఉపాధ్యక్షుడు ఓఝా

పాట్నా: బిహార్ లో రాజకీయ హింస మళ్లీ జూలువిదిల్చింది. చంపారన్ లో బీజేపీ ఎమ్మెల్సీ కేదార్ నాథ్ సింగ్ హత్యకుగురైన 12 గంటల్లోనే.. ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వర్ ఓఝాను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ఆరా పట్టణంలోని తన సొంత ఇంట్లో ఉన్న ఓఝాను శుక్రవారం సాయంత్రం తుపాకితో కాల్చిన దుండగులు పరారయ్యారు. రక్తపుమడుగులో పడిపోయిన ఓఝాను కుటుంబసభ్యులు  ఆసుపత్రికి తరలించేలోగా ఆయన ప్రాణాలు కోల్పోయారు.

షాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగానూ వ్యవహరిస్తోన్న ఓఝా.. బిహార్ బీజేపీ ముఖ్యుడు సుశీల్ కుమార్ మోదీకే కాక, ప్రధాని నరేంద్ర మోదీకి సైత్యం అనుంగుడిగా పేరుపొందారు.12 గంటల్లో బీజేపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు హత్యకు గురికావటం స్థానికంగా సంచలనం రేపింది. ఇప్పటికే శాంతిభద్రతల పరిరక్షణలో జేడీయూ- ఆర్జేడీ సర్కార్ విఫలమైందన్న ఆరోపణల నేపథ్యంలో ఓఝా హత్య మరింత దుమారాన్నిరేపే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement