24కి చేరిన పడవ బోల్తా మృతుల సంఖ్య
బిహార్ : బిహార్ రాజధాని పట్నాలో గంగానదిలో పడవ బోల్తా పడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది. మరోవైపు గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు జరుపుతున్నాయి. ఇప్పటివరకూ 21 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రమాదం జరిగినప్పుడు పడవలో 40మంది ప్రయాణికులు ఉన్నారు.
పడవలో పరిమితికి మిచ్చి ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శనివారం వీరంతా కైట్ ఫెస్టివల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బిహార్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు, పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.వేలు కేంద్రం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు.
పడవ బోల్తా ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా సంతాపం తెలిపారు.