సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై సమర్ధవంతంగా పోరాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై ప్రపంచ కుబేరుడు, దాతృత్వశీలి బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. భారత్‌లో కోవిడ్-19 మహమ్మారి విస్తృత వ్యాప్తిని అరికట్టడంలో మీ సారథ్యంలోని ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పాటు వైరస్ అనుమానితులకు నిరతంరం టెస్ట్‌లు నిర్వహిస్తూ, క్వారంటైన్‌లకు పంపడం వంటి చర్యలు చేపట‍్టడం మెరుగైన ఫలితాలు ఇచ్చిందని ప్రధానిని ఉద్దేశించి బిల్‌గేట్స్ ప్రస్తుతించారని ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి.
మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆరోగ్యంపై అధిక నిధులు వెచ్చించడం, ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచడం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్ధాపకులు బిల్ గేట్స్ ప్రస్తావించారని ఆ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్‌ను గుర్తించి, కాంట్రాక్ట్ ట్రేసింగ్‌కు సహకరించేలా ఆరోగ్య సేతు డిజిటల్ యాప్‌ను ప్రారంభించడం ద్వారా కోవిడ్-19ను ఎదుర్కోవడంలో డిజిటల్ సామర్ధ్యాలను ప్రభుత్వం పెంపొందించిదని బిల్‌గేట్స్ అన్నారని వివరించాయి.
Comments
Please login to add a commentAdd a comment