బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా యడ్యూరప్ప | BJP chief Amit Shah announces his new team | Sakshi
Sakshi News home page

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా యడ్యూరప్ప

Published Sat, Aug 16 2014 12:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా యడ్యూరప్ప - Sakshi

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా యడ్యూరప్ప

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం ప్రకటించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నియమితులయ్యారు. అలాగే  రామ్ మాధవ్, జేపీ నడ్డా, రూడీలకు ప్రధాన కార్యదర్శుల బాధ్యతలు అప్పగించారు. 11మంది వైస్ ప్రెసిడెంట్లు, 8మంది ప్రధాన కార్యదర్శులు, 14మంది కార్యదర్శులతో తన టీమ్ను అమిత్ షా ప్రకటించారు.

 

ఇక తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ, మురళీధరరావుకు, ఆంధ్రప్రదేశ్ నుంచి రాంమాధవ్, జేవీఎల్ నరసింహరావులకు చోటు దక్కగా,కొత్త కార్యవర్గంలో వరుణ్ గాంధీకి చోటు దక్కలేదు. అధికార ప్రతినిధులుగా షానవాజ్ హుస్సేన్, ఎం.జే.అక్బర్ సహా 11 మంది నియమితులయ్యారు. బీజేవైఎం అధ్యక్షునిగా అనురాగ్‌శర్మ ఠాకూర్, బీజేపీ మహిళామోర్చా నాయకురాలిగా విజయ రహత్కర్ కొనసాగనున్నారు. కాగా, ఈ నూతన కార్యవర్గంలోని 60 శాతం మంది 50 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement