ఐఎస్ నుంచి బీజేపీ నేతకు బెదిరింపులు | BJP Leader Shahnawaz Hussain Gets Threat From ISIS | Sakshi
Sakshi News home page

ఐఎస్ నుంచి బీజేపీ నేతకు బెదిరింపులు

Published Sat, Jan 23 2016 10:25 AM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

ఐఎస్ నుంచి బీజేపీ నేతకు బెదిరింపులు - Sakshi

ఐఎస్ నుంచి బీజేపీ నేతకు బెదిరింపులు

న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల నుంచి తనకు బెదిరింపులు వచ్చినట్టు బీజేపీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ చెప్పారు. ఢిల్లీలోని తన నివాసానికి పోస్ట్ ద్వారా ఐఎస్ పేరుతో ఓ లేఖ వచ్చినట్టు తెలిపారు. షానవాజ్ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉర్దు, ఇంగ్లీష్ భాషల్లో లేఖను టైప్ చేసినట్టు షానవాజ్ వెల్లడించారు. బీజేపీని, తనను లేఖలో దూషించారని చెప్పారు. ఇంతకుముందు కూడా సోషల్ మీడియా ద్వారా తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. షానవాజ్ నుంచి ఫిర్యాదు స్వీకరించామని, విచారణ జరుపుతున్నామని డీసీపీ జతిన్ నర్వాల్ చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement