![BJP Ministers Son In Arunachal Gets Life Imprisonment For Murder - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/6/jail-.jpg.webp?itok=r660mm8f)
ప్రతీకాత్మకచిత్రం
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ పరిశ్రమల మంత్రి టుంకె టగ్రా కుమారుడు కజుమ్ బగ్రాకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. వెస్ట్ సియాంగ్ జిల్లా ఆలో పట్టణంలోని హోటల్ వెస్ట్ వెలుపల కెంజుం కంసి అనే వ్యక్తిని 2017 మార్చి 26న బగ్రా కాల్చిచంపారనే అభియోగాలు రుజువైనందున ఆయనకు జీవిత ఖైదు విధించినట్టు కోర్టు వెల్లడించింది.
ఓ కాంట్రాక్టుకు సంబంధించి చెల్లింపులపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో బాగ్రా ఆ వ్యక్తిని హత్య చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. హోటల్ వెలుపల ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో హత్య దృశ్యాలు రికార్డు కావడంతో మంత్రి కుమారుడి నేరం కెమెరా కంటికి చిక్కింది. ఈ హత్య జరిగిన సమయంలో మంత్రి టుంకె టగ్రా అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment