Ministers son
-
హత్య కేసులో మంత్రి కుమారుడికి జీవిత ఖైదు
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ పరిశ్రమల మంత్రి టుంకె టగ్రా కుమారుడు కజుమ్ బగ్రాకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. వెస్ట్ సియాంగ్ జిల్లా ఆలో పట్టణంలోని హోటల్ వెస్ట్ వెలుపల కెంజుం కంసి అనే వ్యక్తిని 2017 మార్చి 26న బగ్రా కాల్చిచంపారనే అభియోగాలు రుజువైనందున ఆయనకు జీవిత ఖైదు విధించినట్టు కోర్టు వెల్లడించింది. ఓ కాంట్రాక్టుకు సంబంధించి చెల్లింపులపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో బాగ్రా ఆ వ్యక్తిని హత్య చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. హోటల్ వెలుపల ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో హత్య దృశ్యాలు రికార్డు కావడంతో మంత్రి కుమారుడి నేరం కెమెరా కంటికి చిక్కింది. ఈ హత్య జరిగిన సమయంలో మంత్రి టుంకె టగ్రా అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేస్తున్నారు. -
మంత్రి తనయుడి కోసం
కర్నూలు (టౌన్) ; విశాలమైన స్థలం, గాలి వెలుతురు, బాడుగ తక్కువ.. ఇలా అన్ని వసతులున్న భవనాన్ని కాదని ఇరుకు గదులు, పార్కింగ్‌కు ఏమాత్రం అవకాశం లేని భవనంలోకి మారనుంది రిజిస్ట్రేషన్ కార్యాలయం. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే ఈ చకచకా సాగుతున్నాయి. జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి తనయుడి కోసం జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ కార్యాలయ తరలింపు ఏమాత్రం ఇష్టం లేకన్నా...ఇక లాంచనమే. మూడు రోజుల క్రితం ఈ విభాగానికి చెందిన ఉన్నతాధికారి ఆ భవనాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ కార్యాలయం గతంలో గౌరిగోపాల్ కాంప్లెక్స్‌లో ఉండేది. పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ద్విచక్ర, కార్లయజమానులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీంతో అక్కడి నుంచి కార్యాలయాన్ని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని అబ్బాస్‌నగర్, న్యూ హాసింగ్ బోర్డు కాలనీలోని వాణిజ్య సముదాయానికి పదే«ళ్ల క్రితం తరలించారు. అయితే ఇటివల ఓ మంత్రి తనయుడు స్థానిక జిల్లా పరిషత్తు ఎదురుగా ఉన్న ఆర్‌ఎంకె ప్లాజాను కోనుగోలు చేసినట్లు సమాచారం. అక్కడ ఇరుకుగా ఉండటం, వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఎలాంటి స్థలం లేకపోవడంతో షాపులు తీసుకునేందుకు ఏ ఒక్కరు ముందుకు రావడంలేదన్నది బహిరంగ రహస్యం. అయితే ఈ వాణిజ్య సముదాయంలో షాపులన్ని పూర్తి కావాలన్న ఉద్దేశ్యంతో జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తరలించాలని నిర్ణయించారు. అధికారం చేతిలో ఉండటంతో ఉన్నత స్థాయి ఆధికారుల ఆదేశాల మేరకు కార్యాలయ తరలింపునకు రంగం సిద్ధమైంది. ఇప్పుడున్న ఈ సముదాయంలో కార్యాలయానికి రూ. 70 వేలు బాడుగ ఉండగా జిల్లా పరిషత్తు ఎదురుగా ఉన్న కొత్త భవనానికి తరలిస్తే మరింత పెరగనుంది. భవనాన్ని పరిశీలించిన డీఐజీ ఆర్‌ఎంకె ప్లాజాను రిజిస్ట్రేషన్ల విభాగం డీఐజీ సాయి ప్రసాద్ మూడు రోజుల క్రితం పరిశీలించారు. ఐజీ ఆదేశాల మేరకు భవనాన్ని తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు కార్యాలయ వర్గాలు ధృవీకరించాయి. నెలరోజుల్లో భవన తరలింపు కార్యాక్రమానికి శ్రీకారం చుట్టడం ఖాయమని రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగులు వెల్లడించారు. -
పాలీ హౌస్‌ల కోసం క్యూలో మంత్రి కుమారుడు !
కోలారు : ఓ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కుమారుడు సాధారణ వ్యక్తి తరహాలో దరఖాస్తుల కోసం క్యూలో నిలబడి అందరికి ఆదర్శంగా నిలిచారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి రమేష్ కుమార్ కుమారుడు హర్ష పాలీ హౌస్‌ల కోసం శుక్రవారం అందరితో పాటు క్యూలో నిలబడి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. పాలీ హౌస్‌ల కోసం మొదట వచ్చిన 200 దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా అధికారులు ప్రకటించడంతో రైతులు దరఖాస్తుల కోసం జిల్లా పంచాయతీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో విచ్చేశారు. దీంతో హర్ష సైతం ఉదయమే డీపీఓ కార్యాలయానికి చేరుకుని వరుసులో నిలుచున్నారు. పాలీ హౌస్‌లకు సంబంధించి ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు రాకూడదని మంత్రి రమేష్‌కుమార్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు సైతం బాధ్యతయుతంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కుమారుడు హర్షం సైతం సామాన్య రైతు మాదిరిగా వరుసలో నిలబడి దరఖాస్తు కోసం వేచి ఉండటం అక్కడి వారిని ఆకట్టుకుంది. దీంతో పలువురు హర్ష నిరాడంబరతను అభినందించారు. -
మంత్రి కుమారునిపై ఫిర్యాదు
నగర్: కాంట్రాక్టుతో నాసిరకం రోడ్డు నిర్మాణం జరుపుతున్నట్లు మంత్రి పూనాట్చి కుమారునిపై ఫిర్యాదు అందింది. తిరుచ్చి జిల్లా, మన్నచనల్లూరు సమీపంలోగల తిరుప్పజీలి వనత్తాయి అమ్మన్ ఆలయ ప్రాంతం నుంచి మూవాయిరంపాళయం వెళ్లే 2.4 కిలోమీటర్ల మట్టి రోడ్డును తారురోడ్డుగా మార్చేందుకు పనులు రూ.53 లక్షల ఖర్చుతో జరుగుతున్నాయి. ఈ పనులను కలెక్టర్ పళనిసామి, ఇతర అధికారులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో రోడ్డు పనులకు నాణ్యత లేని కంకర ఉపయోగించినట్లు, అదికూడా రెండు పొరలకు బదులుగా ఒకే పొరవేయడాన్ని గమనించిన అధికారులు దిగ్భ్రాంతి చెందారు. దీంతో ఆ పనులు జరిపే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. ఆ సమయంలో మంత్రి పూనాట్చి కుమారుడు అరుణ్ కాంట్రాక్టు పనులు జరుపుతున్నట్లు తెలిసింది. దీంతో అతనిపై చర్యలు ఎలా తీసుకోవాలో తెలియకుండా అధికారులు తికమకపడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రి కుమారుడు కలెక్టర్‌ను కలిసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు, అతన్ని కలిసేందుకు కలెక్టర్ అనుమతి ఇవ్వనట్లు సమాచారం.