వచ్చే నెలలో బీజేపీ జాతీయ కౌన్సిల్
సాక్షి, న్యూఢిలీ : పండిట్ దీన్‌దయాళ్ ఉపాథ్యాయ్ నూరవ జయంతోత్సవాల సందర్భంగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు వచ్చే నెల 23 నుంచి దేశ రాజధానిలో జరుగనున్నాయి. పార్టీ జాతీయ, రాష్ట్రస్ధాయి నేతలతో పాటు దేశవ్యాప్తంగా వందలాది పార్టీ సభ్యులు ఈ సమావేశాలకు హాజరవుతారు. గత ఏడాది కేరళలో జరిగిన పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఉపాథ్యాయ్ జయంతోత్సవాలపై ఏడాది పాటు కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు ఇచ్చింది.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ చీఫ్ అమిత్ షా 110 రోజులు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఉపాథ్యాయ్ సిద్ధాంతమైన అంత్యోదయ మోడీ సర్కార్ ముఖ్య నినాదమని పార్టీ వర్గాలు తెలిపాయి. గుజరాత్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో జాతీయ కౌన్సిల్ భేటీలో పార్టీ శ్రేణులకు మోడీ, అమిత్ షాలు దిశానిర్ధేశం చేయనున్నారు.