బిల్లుకు బీజేపీ సవరణలు...
Published Tue, Feb 18 2014 1:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణలను బీజేపీ సిద్ధం చేసింది. సీమాంధ్ర నుంచే ప్రధానంగా సవరణల ప్రతిపాదనలు వెళ్లినట్టు ప్రచారం జరగడం పార్టీలో వివాదానికి దారి తీసింది. బీజేపీ తెలంగాణ ప్రాంత నేతలూ సవరణల్ని కొద్దిరోజులక్రితం అధినాయకత్వానికి అందజేశారు. దీంతో ఇరుప్రాంతాలనుంచి అందిన సవరణల ప్రతిపాదనల్ని క్రోడీకరించి, వాటి నుంచి 9 సవరణల్ని బిల్లులో చేర్చడానికి సిద్ధం చేశారు.
1. తెలంగాణ, సీమాంధ్రల్లో వేర్వేరుగా హైకోర్టులు ఉండాలి 2. పోలవరం, ప్రాణహిత, పాల మూరు సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలి 3. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ లోటు ఉంటే.. దాని భర్తీ బాధ్యత కేంద్రానిదే. కేంద్రం ప్రత్యేకంగా నిధులిచ్చి ఆ లోటు పూరించాలి 4. విద్యుత్ కొనుగోళ్లకు ప్రస్తు తం అమల్లో ఉన్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. ఇరు రాష్ట్రాలకు కొత్తగా ఒప్పందాలను వేర్వేరుగా చేయాలి 5. ఇరు వెటర్నరీ, హార్టీకల్చర్ వర్సిటీలను ఏర్పాటు చేయాలి 6. బిల్లులో ప్రస్తావించిన కేంద్ర వర్సిటీలతోపాటు, ఇతర విశ్వవిద్యాలయా లు, సంస్థల్ని రెండేళ్ల వ్యవధిలో నిర్మించాలి 7. ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే ఎన్నికలు జరపాలి 8. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని ఎక్కడ నిర్మిస్తున్నారనే దానిపై 45 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక ప్యాకేజీలకు కేంద్రమే నిధులివ్వాలి 9. హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్ముకాశ్మీర్ ప్రాంతాల్లో ఆదాయ పన్ను, ఎకై్సజ్ పన్ను రాయితీ ఇచ్చినట్లే రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాల్లోనూ కొన్నేళ్ల వరకు ఇవ్వాలి
Advertisement
Advertisement