ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ముంబయి : మహారాష్ర్టలో స్కూల్ విద్యార్థులు త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ జీవితానికి సంబంధించిన అంశాలను పుస్తకాల్లో అభ్యసించనున్నారు. మహారాష్ర్ట విద్యాశాఖ మోదీ జీవితంలోని పలు కోణాలను స్పృశిస్తూ సాగే పుస్తకాలను అందుబాటులోకి తేనుంది. మోదీ జీవితంపై దాదాపు 1.5 లక్షల పుస్తకాల కొనుగోలుకు విద్యాశాఖ ఆర్డర్ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా పుస్తకాలు రాష్ర్ట ప్రభుత్వ పాఠశాలలకు చేరుకుంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ పుస్తకాలను కూడా ఆర్డర్ చేసినా మోదీ బుక్‌ల కన్నా ఇవి తక్కువ సంఖ్యలో ముద్రించనున్నారని అధికారులు చెప్పారు.
పర్చేజ్ ఆర్డర్ ప్రకారం మోదీ జీవితంపై దాదాపు 1.5 లక్షల పుస్తకాలకు ఆర్డర్ ఇవ్వగా, నెహ్రూపై 1635 పుస్తకాలను, గాంధీపై 4,343 బుక్స్, అంబేద్కర్‌పై 79,388 పుస్తకాలను ముద్రించాలని ఆర్డర్ చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గురించి 76,713 పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చామని అధికారులు తెలిపారు. సర్వ శిక్షా అభియాన్ కింద మరాఠి, ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషల్లో ఈ పుస్తకాలు ముద్రితమవుతాయని చెప్పారు. 1 నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులకు అదనపు రీడింగ్ మెటీరియల్‌గా ఈ పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment