వారికి భంగపాటు తప్పదు: ఒవైసీ
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ, బీజేపీలకు భంగపాటు తప్పదని ఎఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఎస్పీ, కేంద్రంలో బీజేపీ మూడేళ్ల పాలనలో పాలనతో పాటు మతసామరస్యం, ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం బీఎస్పీతో ఎంఐఎం కలిసి పనిచేస్తుందా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడేమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు. మార్చి 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుందన్నారు.