వర్షాలు పడలేదని... ఎంత పని చేశారు!
వర్షాలు పడటం లేదని కప్పల పెళ్లిళ్లు చేయించడం చూశాం. ఇంకా రకరకాల మూఢనమ్మకాలు కూడా ఉంటాయి. కానీ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా పండరిహళ్లిలో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోడానికి ఓ పిల్లాడిని నగ్నంగా ఊరేగించారు. చిత్రదుర్గలో ఈ ఏడాది తీవ్రమైన కరువు తాండవించింది. కొన్ని నెలలుగా ట్యాంకర్లతోనే మంచినీరు సరఫరా చేయాల్సి వస్తోంది. దాంతో వర్షాల కోసం వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోడానికి అక్కడి గ్రామస్తులు ముందుగా ఓ పిల్లాడిని నగ్నంగా చేసి, అతడికి పూలు పెట్టారు.
వినాయకుడి విగ్రహం చేతికి ఇచ్చి, అది పట్టుకుని గ్రామంలో రోడ్లమీద తిరగాలని చెప్పారు. వాళ్లు ఎందుకలా చేస్తున్నారో అతడికి తెలియదు. పెద్దవాళ్లు కదాని వాళ్లు చెప్పినట్లు చేశాడు. అతడు విగ్రహాన్ని గ్రామ శివార్లకు తీసుకెళ్లి అక్కడ నీటిలో నిమజ్జనం చేశాడు. అలా వెళ్తున్నంత సేపు జనం ఆ పిల్లాడి తల మీద కుండలతో చల్లటి నీళ్లు పోస్తూనే ఉన్నారు. తర్వాత పిల్లాడికి కొత్త బట్టలు కొనిచ్చారు. ఇది బాలల హక్కులను ఉల్లంఘించడమేనని బాలల హక్కుల కమిషన్ చె బుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరో వీడియో తీయడంతో కర్ణాటక బాలల హక్కుల రక్షణ కమిషన్ దీనిపై చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతోంది.