గాంధీనగర్: గుజరాత్‌లో కొన్ని గిరిజన గ్రామాల్లో విచిత్ర సంప్రాదాయం కొనసాగుతుంది. పెళ్లిలో వరుడికి బదులు అతని చెల్లి వధువుకి తాళి కడతారు. ఈ సంప్రాదాయం గుజరాత్‌లోని సుర్కేడా, సనద, అంబల్ గ్రామాల్లో అమలులో ఉంది. అక్కడి ఆచారం ప్రకారం వరుడు పెళ్లి వేడుకల్లో కనిపించరు. వివరాల్లోకి వెళితే.. ఈ గ్రామాల్లో జరిగే పెళ్లిలో వరుడి పెళ్లికాని సోదరి కానీ, లేదా ఆ కుటుంబంలో పెళ్లికాని అమ్మాయి కానీ అతని స్థానంలో ఉండి పెళ్లితంతు నిర్వహిస్తారు. అయితే వరుడు మాత్రం తన తల్లితో కలిసి ఇంటి వద్దే ఉంటారు.
పెళ్లిలో వరుడు చేయాల్సిన కార్యక్రమాలు మొత్తం అతని చెల్లి చేస్తుంది. ఆ మూడు గ్రామాల్లోని పురుష దేవతలు బ్రహ్మచారులు కావడంతో వారి గౌవరం కోసం గ్రామస్తులు వరుడిని ఇంట్లోనే ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ఆ జంటకు ఎటువంటి హాని జరగదని గ్రామస్తులు నమ్ముతారు. దీనిపై సుర్కేడా గ్రామ పెద్ద రామ్‌సింగ్‌భాయ్ రత్వా మాట్లాడుతూ.. ‘ఈ ఆచారాన్ని అతిక్రమించిన వారికి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. మూడు గ్రామాల్లో ఈ సంప్రాదాయం కొనసాగుతుంది. దీనిని అతిక్రమించిన వారికి కుటుంబ కలహాలు రావడమో, ఇతర ఇబ్బందులు తలెత్తాయ’ని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment