జమ్మూలో బస్సు ప్రమాదం: ముగ్గురి మృతి | Bus accident in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూలో బస్సు ప్రమాదం: ముగ్గురి మృతి

Published Wed, Aug 16 2017 1:05 PM | Last Updated on Tue, Sep 12 2017 12:14 AM

Bus accident in Jammu and Kashmir

జమ్ము కశ్మీర్‌: జమ్మూలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్ము-పఠాన్‌కోట్‌ రహదారిపై సాంబా ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగింది.
 
చెక్‌వాల్‌ గ్రామం నుంచి సాంబాకు ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో  ప్రమాదం జరిగింది. మృతుల్లో ఓ మహిళ ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement