కేంద్ర కేబినెట్ భేటీ, టీ.బిల్లుపై చర్చ
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ గురువారం ఉదయం సమావేశం అయ్యింది. రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై ఎలా ముందుకు వెళ్లాలీ ? కిరణ్ రాజీనామా నేపథ్యంలో.. రాష్ట్రంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై కేబినెట్ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఆది నుంచీ రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు.. లోక్‌సభలో ఆమోదం పొందటంతో ఇక ఓ కొలిక్కి వచ్చినట్లేనని అంతా భావిస్తుండగా.. అనూహ్య మలుపు తిరిగింది.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభలో బేషరతు మద్దతు ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం బీజేపీ.. అదే బిల్లుకు రాజ్యసభలో సవరణలు ప్రతిపాదించింది. దీంతో కాంగ్రెస్ సారధ్యంలోని యూపిఏ సర్కారుకు ఏమీ పాలుపోవడం లేదు. ప్రతిపక్ష నేతలతో మంతనాలు జరుపుతున్న ప్రభుత్వ పెద్దలు చర్చలు ఓ కొలిక్కి వస్తే బిల్లును నేడు రాజ్యసభలో పెట్టనున్నారు.