కాకినాడలో రహదారి మళ్లింపునకు కూడా
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దేశంలో మరో 62 కొత్త జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)లను ప్రారంభించేందుకు బుధవారం ఆమోదం తెలిపింది. రూ.2,871 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు 11, గుజరాత్‌కు 8, ఢిల్లీకి 7, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లకు చెరో 5 జేఎన్‌వీలు దక్కారుు. పల్లెల్లోని ప్రతిభావంతుల కోసం ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కాకినాడలో నౌకాదళానికి చెందిన భూభాగం నుంచి వెళ్తున్న రాష్ట్ర రహదారి(ఎస్‌హెచ్)-149 మార్గం మళ్లింపునకు కేబినెట్ ఆమోదం లభించింది.
ప్రస్తుతం ఈ దారి విస్తరించి ఉన్న 11.25 ఎకరాలను ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం నుంచి కేంద్రం తీసుకుంది. దీనికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త మార్గం నిర్మాణం కోసం 5.23 ఎకరాల భూమిని, రూ. 18.83 కోట్ల డబ్బును పరిహారంగా చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ఈ రహదారిని మళ్లించడం ద్వారా శిక్షణా కార్యక్రమాలను ఏ ఆటంకం లేకుండా నిర్వహిచుకోవచ్చని కేంద్రం తెలిపింది. అలాగే సులభతర వ్యాపార నిర్వహణను ప్రోత్సహించడంతోపాటు సేవలలో పారదర్శకత, నాణ్యతను తీసుకొచ్చేందుకు తోడ్పడే ‘మర్చంట్ షిప్పింగ్ బిల్లు’ను కూడా మంత్రివర్గం ఆమోదించింది.
62 కొత్త నవోదయలకు కేబినెట్ ఓకే
Published Thu, Nov 24 2016 1:16 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
Advertisement