సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఇటీవల ఓ జంటకు విడాకులు మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఇకపై భార్యాభర్తల్లో ఎవరూ కూడా ఒకరి ఫొటోలను మరొకరు సామాజిక మాధ్యమాలు సహా ఎక్కడా పెట్టకూడదని ఆదేశించింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇందుకు ఆమె కూడా ఒప్పుకోవడంతో కోర్టు వారి వివాహాన్ని రద్దు చేసింది.
విడాకులు ఇచ్చినందున ఇకపై భార్యాభర్తలు ఒకరి ఫొటోలను మరొకరు సామాజిక మాధ్యమాలు సహా ఎక్కడా ప్రదర్శించకూడదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. భార్యకు భర్త రూ. 37 లక్షల భరణాన్ని కూడా ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. వీరి వైవాహిక జీవితం, ఆస్తి గొడవలు తదితరాలపై ఉన్న అన్ని కేసులనూ కొట్టేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment