’బతుకు, బతికించు.. సూత్రం పాటించండి’ | Cauvery water dispute: Karnataka Govt files reply in SC | Sakshi
Sakshi News home page

’బతుకు, బతికించు.. సూత్రం పాటించండి’

Published Fri, Sep 2 2016 2:08 PM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM

’బతుకు, బతికించు.. సూత్రం పాటించండి’ - Sakshi

’బతుకు, బతికించు.. సూత్రం పాటించండి’

న్యూఢిల్లీ: కావేరి నది నుంచి తమిళనాడుకు నీళ్లు ఇవ్వలేమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టుకు కర్ణాటక సర్కారు సమాధానం ఇచ్చింది. ఇప్పటికే కావేరిలో 8 టీఎంసీల నీళ్లు తక్కువగా ఉన్నాయని, తమిళనాడుకు 50 టీఎంసీల నీళ్లు ఇవ్వలేమని చెప్పింది.

ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బతుకు, బతికించు’  నియమాన్ని రెండు రాష్ట్రాలు అనుసరించాలని సూచించారు. రెండు రాష్ట్రాలు సుహృద్భావంతో మెలగాలని ఆకాంక్షించారు. కావేరి ట్రిబ్యునల్ అవార్డు నిర్ణయం ఆధారంగా ఈ సమస్యను పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం భావిస్తోంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement