Karnataka govt
-
చెరిగిపోని సిరాచుక్క
చూపుడువేలిపై సిరా చుక్క. ఓటేశామని చెప్పేందుకు తిరుగులేని గుర్తు. పోలింగ్ బూత్ నుంచి బయటికి రాగానే చూపుడువేలిపై సిరా చుక్కను చూపిస్తూ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాం. ఆ ఇంకు కథ ఆసక్తికరం. ప్రపంచవ్యాప్తంగా.. మన దేశంలో 1962 లోక్‌సభ ఎన్నికల నుంచి సిరా చుక్క వాడకం మొదలైంది. నాటినుంచి నేటిదాకా కర్ణాటక ప్రభుత్వ సంస్థ మైసూర్ పెయింట్సే దీన్ని సరఫరా చేస్తోంది. 30 పై చిలుకు దేశాలకు ఈ ఇంకును ఎగుమతి చేస్తోంది కూడా. ఇదీ ప్రత్యేకత... ► ఓటేసినట్లు రుజువుగా ఓటరు ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు. చూపుడు వేలు లేకుంటే ఎడమ చేతిలోని ఇతర వేలిపై వేస్తా రు. ఎడమ చేయే లేకుంటే కుడిచేతి వేళ్లలో దేనికైనా వేస్తారు. రెండు చేతులు లేకుంటే? ఎడమ లేదా కుడి చేయి చివరి భాగాలకు సిరా గుర్తు వేయాలని ఈసీ చెబుతోంది. ► సిరా చుక్కలో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది రుద్దిన 40 సెకన్లలోపే ఆరిపోతుంది. చర్మంతో చర్య జరిపి బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. దాంతో త్వరగా చెరగదు. ఇంకు గుర్తు సాధారణంగా చర్మంపై మూడు రోజుల దాకా ఉంటుంది. గోరుపై మాత్రం వారాల పాటు ఉంటుంది. ► 5.1 మిల్లీలీటర్ల సీసాలోని ఇంకుతో సుమారు 700 మందికి గుర్తు వేయవచ్చు. ఈ లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 26 లక్షల ఇంకు బాటిళ్లు ఆర్డర్ చేసింది. ► మామూలుగా ఎన్నికల్లోనే వాడే ఈ ఇంకును ఇతరత్రా వాడేందుకు ఒకేసారి ఈసీ అనుమతించింది. అదెప్పుడంటే.. కరోనా వ్యాప్తి సమయంలో. కోవిడ్ బారిన పడి క్వారెంటైన్లో ఉన్నవారిని గుర్తించడానికి పలు రాష్ట్రాలు ఈ ఇంకును ఉపయోగించాయి. – సాక్షి, ఎలక్షన్ డెస్క్ -
‘40% కమీషన్’పై న్యాయ విచారణ
బెంగళూరు: గత బీజేపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారనే ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల క్రితం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు..హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ నాగమోహన్ దాస్ సారథ్యంలోని కమిటీకి విచారణ బాధ్యతలను అప్పగిస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో 40 శాతం కమీషన్ కుంభకోణంపై విచారణ జరిపించడం కూడా ఉంది. భారీగా పనులు చేపట్టిన శాఖలపై ఈ కమిషన్ విచారణ చేపట్టనుంది. అన్ని ప్రజా పనుల్లో 40 శాతం కమీషన్ తమ నుంచి వసూలు చేస్తున్నారంటూ కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అప్పట్లో ప్రధానికి, సీఎంకు లేఖలు రాయడం గమనార్హం. పనులు ప్రారంభించకమునుపే 25 నుంచి 30 శాతం వరకు కమీషన్‌ను ప్రజాప్రతినిధులకు చెల్లించినట్లు కాంట్రాక్టర్లు అందులో ఆరోపించారు. -
ఫుల్ కిక్కు, తెగ తాగేస్తున్నారుగా.. ఐదేళ్లుగా రికార్డ్ సేల్స్!
శివాజీనగర(బెంగళూరు): రాష్ట్రంలో మద్యం వినియోగం సర్కారు నిర్దేశించిన మేరకు వంద శాతాన్ని చేరుతోంది. ఇది నెలా, రెండు నెలలకో కాదు, గత ఐదేళ్లుగా మద్యం ద్వారా కాసుల వర్షం కురుస్తోంది. స్వయంగా అబ్కారీ మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. మద్యం కొనుగోలు వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు తగ్గించడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో సర్కారు దిగివచ్చింది. పాత పద్ధతిలోనే 21 ఏళ్లనే కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కే.గోపాలయ్య తెలిపారు. గురువారం విధానపరిషత్ ప్రశ్నోత్తరాల సమయంలో జేడీఎస్ సభ్యుడు గోవిందరాజు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. వయో పరిమితిని తగ్గిస్తూ జనవరి 9న ఉత్తర్వులు జారీ చేశాం, అయితే ఇందుకు అనేక అభ్యంతరాలు రావడంతో పరిశీలన జరిపి పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఐదేళ్లుగా మద్యం ఆర్థిక లక్ష్యం సఫలం గ్రామాల్లో అక్రమ మద్యం అమ్మకాల గురించి అనేకచోట్ల కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. మద్యానికి బాగా గిరాకీ ఉండడంతో ఈ సంవత్సరం ఎక్సైజ్ శాఖ నిర్ధారించిన ఆర్థిక లక్ష్యాన్ని దాటుతుందని చెప్పారు. గత ఐదు సంవత్సరాలు వరుసగా నిర్ధారిత లక్ష్యాన్ని చేరుకొన్నట్లు చెప్పారు. -
శివకుమార స్వామికి తుది నివాళులు
-
శివకుమార స్వామికి తుది నివాళులు
సాక్షి, బెంగళూర్ : లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ సోమవారం తుదిశ్వాస విడిచిన ఆథ్యాత్మిక గురు, సిద్ధగంగ మఠానికి చెందిన శివకుమార స్వామి (111) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరగనున్నాయి. శివకుమార స్వామిని కడసారి వీక్షించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు, సన్యాసులు తుంకూర్లోని మఠానికి తరలివచ్చారు. లింగాయత్‌ల ఆరాధ్యదైవంగా పేరొందిన స్వామిని నడిచే దేవుడిగా వారు భావిస్తుంటారు. శివకుమార స్వామి మృతికి రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల సంతాపదినాలను ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. స్వామి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి ఆయన ఎనలేని కృషి సాగించారని కొనియాడారు. -
తల్లి చెట్టుకు నీడ కరువైంది
తిమ్మక్క చేతిలో చిల్లిగవ్వ లేదు. అయితే ఆమె చేతిలో.. భారత ప్రభుత్వం ఇచ్చిన నేషనల్ సిటిజన్ అవార్డు ఉంది. ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు ఉంది. మాతా శిశుసంరక్షణ కేంద్రం ఇచ్చిన గౌరవ సర్టిఫికెట్ ఉంది. ఇవేవీ ఆమెకు గుప్పెడు తిండి గింజల్ని ఇవ్వలేకపోయాయి. అందుకే తిమ్మక్క.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తనకిచ్చిన అవార్డును తిరస్కరించింది. ‘సాలుమరడ’ తిమ్మక్క వయసు 105. కర్ణాటకలో ఆమె పెంచిన మర్రిచెట్లు ఎనిమిది వేలకు పైమాటే! తిమ్మక్క కర్ణాటక మాగడి తాలూకా హులికల్ అనే చిన్న గ్రామంలో జన్మించింది. బాల్యంలోనే పశువులను కాసే చిక్కయ్యను వివాహమాడింది. రాళ్లు కొడుతూ, భూమి దున్నుతూ జీవనం గడిపారు ఈ దంపతులు. దురదృష్టవశాత్తు వారికి సంతానం కలగలేదు. తిమ్మక్క ఏ మాత్రం కుంగిపోలేదు. తన జీవితాన్ని చెట్ల పెంపకానికి అంకితం చేసింది. భర్తతో కలిసి ఊరికి దగ్గరలో కుదూర్ రోడ్డుకి ఇరుపక్కలా మర్రి విత్తనాలు నాటుతూ, వాటిని సొంత పిల్లల్లా సాకడం ప్రారంభించింది. తను తిన్నా తినకున్నా వాటిని మాత్రం ఏళ్లుగా సంరక్షిస్తూనే ఉంది. ఇప్పటికీ మొక్కలు నాటుతూనే ఉంది. చెట్ల మొక్కలు నాటడం వల్లే ఆమెకు సాలుమరడ (చెట్ల వరుస) అని పేరు వచ్చింది. తిమ్మక్క చేసిన పర్యావరణ పరిరక్షణ సేవలకు గుర్తింపుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. అయితే ఇన్ని అవార్డులు సంపాదించుకున్న తిమ్మక్కకు ప్రభుత్వం ఆర్థికంగా ఒక్క సహాయమూ చేయలేదు. ప్రభుత్వం నుంచి రావలసిన సహాయం కూడా సమయానికి అందకపోగా, వెళ్లి అడిగినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల ప్రభుత్వం అవార్డును ఇవ్వబోతే,‘‘నేను దళితురాలిని అనే ఉద్దేశంతో నాకు అవార్డు ఇవ్వొద్దు. ప్రతివారు మెడల్స్, బహుమతులు ఇస్తారే కాని, ఒక్కరూ నాకు డబ్బు ఇవ్వాలని ఎందుకు అనుకోలేదో నాకు అర్థం కావట్లేదు’’ అని ఆవేదనగా అంది తిమ్మక్క. – డా. వైజయంతి -
మెతుకు పడేస్తే మూడినట్లే..
సాక్షి, బెంగళూరు : ఒక్క పూట భోజనం దొరక్క అల్లాడిపోయే నిరుపేదలు ఒక వైపు.. పెళ్లిళ్లు, విందులు, సంబరాల పేరిట ఆహారాన్ని కుప్పతొట్టిపాలు చేస్తున్న వారు మరో వైపు. రైతన్న ఆరుగాలం శ్రమించి పండించిన పంట అన్నార్తులకు చేరకుండానే చెత్తబుట్టల్లోకి చేరిపోతోంది. ఈ విధంగా ఆహారం వ్యర్థమవుతుండడాన్ని నిరోధించేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు పూనుకుంది. ఇది అమల్లోకి వస్తే ఆహారాన్ని వ్యర్థం చేసిన వారికి గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష, రూ.10 వేల వరకు జరిమానా తప్పదు. కళ్లుతిరిగే వృథా దేశ ఐటీ సిటీలో పెళ్లిళ్లు, విందులు, ఇతర కార్యక్రమాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లలో కలుపుకుని భారీగా ఆహారం వృథా అవుతోంది. ఇలా ఏడాదికి వ్యర్థమవుతున్న ఆహారంతో 2.6 కోట్ల మంది ఒక పూట భోజనం చేయవచ్చు. బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనంలో ఏటా 943 టన్నుల ఆహారం చెత్తకుప్పలో చేరుతోందని తేలింది. దీంతో ఇక రాష్ట్ర రాజధాని బెంగళూరుతో పాటు ఏ ప్రాంతంలోనైనా సరే ఆహారాన్ని వృథా చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్షను విధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి యూటీ ఖాదర్ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర న్యాయశాఖ ‘కర్ణాటక ఆహార వ్యర్థ నియంత్రణ, వినిమయ చట్టం’ పేరిట ముసాయిదా బిల్లును రూపొందిస్తోంది. కళ్యాణ మండపాలు, హోటళ్లు, సంస్థలు, సమూహాలు ఈ బిల్లు పరిధిలోకి వస్తాయి. కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ముసాయిదాను చట్టంగా చేసిన తర్వాత దీన్ని అమలు చేసేందుకుగాను ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటవుతుంది. ఇందులో ఆహార, పౌర సరఫరాలశాఖ అధికారితో పాటు జిల్లా ఎస్పీ, జిల్లా పంచాయతీ అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు. వీరు ఇతరుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పాటు తామే సుమోటోగా తీసుకొని కూడా కేసులు నమోదు చేస్తారు. విచారణ కోసం జిల్లాకు ఒక కోర్టును ఏర్పాటు చేస్తారు. ఆహారాన్ని వృథా చేసినట్లు విచారణలో రుజువైతే సంబంధిత రెస్టారెంట్ల యజమానులు, కళ్యాణ మండపాల నిర్వాహకులతో పాటు పెళ్లిళ్లు, విందులు నిర్వహించిన వారికి కూడా శిక్ష విధిస్తారు. -
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పెద్దపీట
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కాలుష్య నియంత్రణతో పాటు సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. వినూత్న ఆఫర్లను ప్రకటిస్తూ పెట్టుబడులను ఆకర్షించడమే కాక మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ప్రత్యేక పాలసీని రూపొందించగా, ఇది త్వరలోనే అమల్లోకి రాబోతోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ముందుకొచ్చే సంస్థలకు ఐదేళ్ల పాటు ట్యాక్స్ హాలిడేను ప్రకటించనుంది. ల్యాండ్ కన్వర్షన్ ఫీజు మొత్తాన్ని (100 శాతం) రీయింబర్స్ చేయడంతోపాటు స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటుకు అయ్యే మొత్తంలో 50 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించనుంది. ఈ వాహనాల టెస్టింగ్ ట్రాక్‌ను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ప్రభుత్వమే నిర్మించనుంది. వాహనాల చార్జింగ్ పాయింట్లకు అవసరమైన స్థలాన్ని స్థానిక సంస్థలే సమకూర్చనున్నాయి. ఇక కేవలం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ముందుకొచ్చే పెట్టుబడిదారులకే కాకుండా ఆ వాహనాలు వినియోగించే వారికి (నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు) కూడా అనేక రాయితీలకు ప్రభుత్వం కల్పించనుంది. ముఖ్యంగా రోడ్, రిజిస్ట్రేషన్ చార్జీలను రద్దు చేయనుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించిన కోర్సులు (డిప్లొమో నుంచి పీహెచ్డీ వరకూ) చదివే విద్యార్థుల ఫీజుల్లో 50 శాతం వరకూ రీయింబర్స్ చేయనుంది. దీని వల్ల ఎక్కువ మంది ఈ కోర్సులు చదవడానికి ముందుకు వస్తారని, తద్వారా పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను రాష్ట్రం నుంచే అందించడానికి వీలవుతుందనేది ప్రభుత్వ భావిస్తోంది. -
గౌరీలంకేశ్ కేసులో మరో సంచలన విషయం
► గౌరీ లంకేశ్, ఎం.ఎం కాల్బుర్గీ హత్యలకు ఒకే ఆయుధం సాక్షి, బెంగుళూరు: ప్రముఖ జర్నలిస్ట్, సామాజికవేత్త గౌరీలంకేశ్ హత్యకేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2015 ఆగస్టులో హత్యకు గురైన ప్రముఖ రచయిత, హేతువాది డాక్టర్ ఎం.ఎం కాల్బుర్గి, గౌరీ లంకేశ్ హత్యలు ఒకే ఆయుధంతో చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ ప్రాధమిక నిర్ధారణలో వెల్లడైంది. 7.65 ఎం.ఎం తో దేశంలో తయారైన తుపాకీతో చంపినట్లు ప్రాథమిక పరిశోధనలు సూచించాయి. ఈరెండు హత్యల్లో సుమారు 80శాతం పోలికలు సరిపోలాయని, ఈ ఘోరాలను ఒకే తుపాకిని ఉపయోగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లంకేశ్ హత్యపై కుటుంబ సభ్యులు సీబీఐ విచారణను డిమాండ్ చేయగా, కర్ణాటక ప్రభుత్తం ఐజీపీ ఇంటలిజెన్స్ అధికారి బీకే సింగ్ నేతృత్వంలో 19 మంది అధికారులతో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు బెంగుళూరు, ఇతర మావోయిస్టు ప్రభావిత జిల్లాలో సిట్ సుమారు 80మందిపైగా విచారించింది. గౌరీలంకేష్ హత్య గావించబడిన రోజు ఆమె ఇంటిముందు మూడు సార్లు అనుమానాస్పదంగా తిరిగిన గుర్తు తెలియని వ్యక్తి గురించి ముమ్మరంగా గాలింపు చేపట్టింది. -
హంతకుల ఆచూకీ చెబితే భారీ రివార్డు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్ హత్య చేసిన వారి ఆచూకీ చెబితే రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. గౌరి హత్య కేసును విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులతో ఆయన సమావేశమయ్యారు. దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బెంగళూరులోని రాజరాజేశ్వరనగర్‌లోని తన నివాసం వద్ద గౌరీ లంకేశ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి అతిసమీపం నుంచి కాల్చిచంపారు. గౌరి హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, గౌరీ లంకేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం సిద్ధరామయ్య నిన్న తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించబోమని తామేనాడూ చెప్పలేదని, గౌరి లంకేశ్ కుటుంబ సభ్యులు కోరితే ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో సిద్ధరామయ్య విఫలమయ్యారని, ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. -
ఆ కలతో..అపార నిధికి అన్వేషణ!
► చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ ప్రాచీన భవనాల్లో నిక్షేపాలు ► తుమకూరు యువకునికి కల ► సీఎంకు లేఖతో కార్యాచరణ శివాజీనగర(కర్ణాటక): ప్రాచీన భవనాలలో అపార స్థాయిలో నిధి ఉందని తుమకూరుకు చెందిన ఓ యువకుడు కన్న కల నిధి వేటకు దారితీసింది. అది కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యదర్శి ఎల్.కే.అతీక్, పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసి, రహస్య నిధి కోసం గాలించాలని సూచించారు. చిత్రదుర్గ జిల్లా ఇన్చార్జి మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ కూడా దీనిపై కన్నడ సంస్కృతి శాఖకు లేఖ రాసినట్లు వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే... ‘చిత్రదుర్గ జిల్లాలోని హొసదుర్గ తాలూకాలో ప్రాచీన భవనాల్లో అపారమైన నిధి ఉంది. 2 బంగ్లాల్లో ఆరు గదుల్లో అపారమైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు’ నాకు కలలో వచ్చింది. ఈ రహస్య బంగ్లాలో శోధిస్తే లభించే అపారమైన నిధిని రాష్ట్ర సంక్షేమానికి ఉపయోగించుకోవచ్చు’ అని తుమకూరుకు చెందిన 29 ఏళ్ల ప్రద్యుమ్న యాదవ్ అనే యువకుడు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కొంతకాలం కిందట లేఖ రాశాడు. దాని ఆధారంగా జరుగుతోంది. 300 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన యదునందనా చిత్ర భూపాల సామ్రాట్ తన సామ్రాజ్యంపై శత్రువుల దాడి జరగడానికి ముందు అపారమైన బంగారు ఆభరణాలను ఈ భవనాల్లో దాచిపెట్టినట్లు కల వచ్చిందని యాదవ్ చెబుతున్నాడు. యువకుడు చెప్పిన కలలో నిజమెంతో తెలుసుకోవాలనుకున్న ప్రభుత్వం ప్రాచీన బంగ్లాల్లో పరిశీలనలను జరపాలని ఆదేశించినట్లు సమాచారం. -
జయ కేసు తీర్పును సమీక్షించం: సుప్రీం
న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీం తీర్పును సమీక్షించాలన్న కర్ణాటక ప్రభుత్వం వినతిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ‘ఈ కేసులో కోర్టు ముందుకొచ్చిన సమీక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం. మా దృష్టిలో జయ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఫిబ్రవరి 14, 2017న ఇచ్చిన తీర్పుపై ఎలాంటి సమీక్ష జరపబోం’ అని జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవ రాయ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 14న తన తీర్పులో సుప్రీంకోర్టు ఏఐఏడీఎంకే చీఫ్ వీకే శశికళతోపాటు మరో ఇద్దరిని దోషులుగా నిర్ధారించటంతోపాటు జయలలిత చనిపోయినందున ఆమెను కేసునుంచి తప్పించింది. జరిమానా వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే జయను తప్పించటం వల్ల రూ.100కోట్ల జరిమానాను రాబట్టుకోవటం కష్టమని.. అదువల్ల ఇటీవలి తీర్పును సమీక్షించాలంటూ కర్ణాటక పిటిషన్ వేసింది. దీన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది. -
’బతుకు, బతికించు.. సూత్రం పాటించండి’
న్యూఢిల్లీ: కావేరి నది నుంచి తమిళనాడుకు నీళ్లు ఇవ్వలేమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టుకు కర్ణాటక సర్కారు సమాధానం ఇచ్చింది. ఇప్పటికే కావేరిలో 8 టీఎంసీల నీళ్లు తక్కువగా ఉన్నాయని, తమిళనాడుకు 50 టీఎంసీల నీళ్లు ఇవ్వలేమని చెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బతుకు, బతికించు’ నియమాన్ని రెండు రాష్ట్రాలు అనుసరించాలని సూచించారు. రెండు రాష్ట్రాలు సుహృద్భావంతో మెలగాలని ఆకాంక్షించారు. కావేరి ట్రిబ్యునల్ అవార్డు నిర్ణయం ఆధారంగా ఈ సమస్యను పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం భావిస్తోంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
ఆ టెక్ పార్కులో అందరూ మహిళలే!
బెంగళూరు: నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని హరోహల్లి గ్రామం వద్ద 300 ఎకరాల్లో కర్ణాటక ప్రభుత్వం కేవలం మహిళల కోసమే టెక్నాలజి పార్కును ఏర్పాటు చేస్తోంది. పారిశ్రామిక, సమాచార రంగంలో కూడా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే సత్సంకల్పతో కర్ణాటక ప్రభుత్వం 2014-2019 పారిశ్రామిక విధానాన్ని రూపొందించిన విషయం తెల్సిందే. అందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ టెక్ పార్క్‌ను డిజైన్ చేయడానికి మహిళా ఆర్కిటెక్ట్‌లను, మహిళా కాంట్రాక్టులను మాత్రమే పిలవడం మరో విశేషం. ఇందులో వివిధ వెంచర్లను ప్రారంభించేందుకు గత కొన్ని వారాల్లోనే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల నుంచి 56 దరఖాస్తులు అందాయని రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక విభాగం అదనపు చీఫ్ సెక్రటరీ కే. రత్న ప్రభ మీడియాకు తెలిపారు. ఈ పార్కులో ఐటీలు, ఐటీస్తోపాటు ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, టెలికామ్, ఎలక్ట్రానిక్స్ తదితర వెంచర్లను ప్రారంభించేందుకుగాను ఈ దరఖాస్తులు వచ్చాయని, 135 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2,800 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని ఆమె వివరించారు. కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేకించిన ఈ పార్కులో తమ వెంచర్లు ప్రారంభించేందుకు ఇకియా, వాల్‌మార్ట్, టొయోటా లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఉత్సాహం చూపుతున్నాయని రత్న ప్రభ తెలిపారు. ఈ పార్కును ఈ ఏడాది నవంబర్ నెల నాటికి పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని ఆమె చెప్పారు. ఈ పార్కుకు వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకొని మైసూర్, హుబ్బలి-ధార్వాడ్, బెలగావి, బళ్లారిలో కూడా ప్రత్యేక మహిళా క్లస్టర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు పరిధిలో కూడా మహిళలకు 942 ప్లాట్లను కేటాయించామని అన్నారు. -
పెళ్లికి 300 మందికి మించి వస్తే ...
ఇకపై ఆడంబరాల వివాహాలకు చెల్లుచీటి! ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్న ప్రభుత్వం బెంగళూరు : లక్షలు... కోట్ల రూపాయలు... ఖర్చు చేసి ధూంధాం... అంటూ పెళ్లి చేసుకుంటామంటే ఇక కుదరకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆడంబరాల పెళ్లిళ్లకు అడ్డుకట్ట వేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బిల్లును శాసనసభలో సభ్యుల అనుమతి కోసం ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రంలో విమర్శలు చెలరేగుతున్నాయి. కాగా, ఈ ముసాయిదా బిల్లులో కొన్ని ముఖ్య నిబంధనలు.... *కల్యాణ మండపం అద్దె రూ. 50 వేలకు మించకూడదు *అతిథిలు 300కు కంటే ఎక్కువ మంది హాజరుకాకూడదు *పెళ్లికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి *నిబంధనలు ఉల్లంఘిస్తే వధూవరుల తల్లిదండ్రుల నుంచి అపరాధ రుసుమును వసూలు చేస్తారు. -
ఎవడబ్బ సొమ్ము?