
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు మహమ్మారి బారినపడుతున్నారు. సీబీఐ డీఐజీ అఖిలేష్ సింగ్‌తో పాటు గర్భవతిగా ఉన్న ఆయన భార్యకు నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. కాగా బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింథియా ఆయన తల్లి మాధవి రాజె సింథియాలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారు ఇరువురూ దక్షిణ ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు జ్వరం, గొంతునొప్పి వంటి కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కోవిడ్-19 పరీక్ష నిర్వహించారు. కోవిడ్-19 టెస్ట్ రిపోర్ట్ కోసం అధికారులు వేచిచూస్తున్నారు. ఇక ఢిల్లీలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. దేశ రాజధానిలో ఇప్పటివరకు మొత్తం దాదాపు 30వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment