సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కొనసాగుతున్న కరోనా వైరస్ నియంత్రణ చర్యలను, తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కొద్దిసేపటి క్రితం సమావేశమైంది. 7 లోక్ కల్యాణ్‌మార్గ్‌లోని ప్రదాని మోదీ నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. లాక్‌డౌన్ సమయంలో రాష్ట్రాలకు ఇచ్చే ఆర్థిక ప్యాకేజీపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అలాగే ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యం(డీఏ) పెంచకూడదని కేంద్రం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment