కొలీజియం అభ్యంతరాలపై కేంద్రం
న్యూఢిల్లీ: జడ్జీ నియామకాలకు సంబంధించిన ముసాయిదా విధివిధానాల పత్రంపై కొలీజియం సిఫారసును జాతీయ ప్రయోజనాల ప్రాతిపదికపై తిరస్కరించే హక్కును ప్రశ్నించటంతో పాటు కొలీజియం వ్యక్తంచేసిన అభ్యంతరాలను తిప్పికొట్టేందుకు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉదహరించాలని కేంద్రం నిర్ణయించింది. సుప్రీం 1993, 1998, 2015లో ఇచ్చిన తీర్పుల ఆధారంగా తమ వాదనలన్నీ ఉంటాయని ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు, 24 హైకోర్టులకు జడ్జీల నియామకానికి మార్గదర్శనం చేసే సవరించిన విధివిధానాల ముసాయిదా పత్రంలో కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని సూచిస్తూ కొలీజియం గత నెల కేంద్రానికి తిప్పి పంపింది.
ఏదైనా నియామకానికి సంబంధించి సుప్రీం పునరుద్ఘాటించినట్లయితే ప్రభుత్వం మర్యాదపూర్వకంగా దానిని ఆమోదిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఆ కేసులను మర్యాదపూర్వకంగా ఆమోదిస్తాం. అంతే కానీ సుప్రీం మమ్మల్ని ఆదేశించినట్లు కాదు. ఈ విషయాన్ని సుప్రీం తీర్పుల్లోనే స్పష్టంచేయటం జరిగింది. వాటి ప్రాతిపదికగానే కొలీజియం మనుగడలోకి వచ్చింది’ అని ప్రభుత్వ ప్రతినిధి ఒకరన్నారు. పత్రంలోని కీలక అంశాలను కొలీజియం తిరస్కరించటంపై న్యాయ మంత్రి డి.వి.సదానందగౌడను ప్రశ్నించగా.. ఆ విషయం ఇంకా పరిశీలనలో ఉందన్నారు.
‘సుప్రీం’ తీర్పులతో తిప్పికొడతాం
Published Wed, Jun 29 2016 2:32 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement
Advertisement