
జీఎస్‌టీ పరిధిలో పెట్రో.. పరిశీలిస్తాం
► కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్
విశాఖసిటీ: పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర విద్యుత్, ఖనిజ శాఖ మంత్రి పీయూష్‌గోయల్ తెలిపారు. విశాఖపట్నంలో వర్తక, వాణిజ్య సంఘాలతో జీఎస్‌టీపై ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఒక దేశం, ఒక పన్ను విధానం అమలులోకి వచ్చాక అవినీతి రహిత భారతావని ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు .