
జమ్ము కశ్మీర్ సమగ్రాభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌కు ఐదుగురు సభ్యులతో కూడిన మంత్రుల బృందాన్ని (జీఓఎం) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీఓఎంలో కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, తవర్ చంద్ గెహ్లోత్, జితేందర్ సింగ్, నరేంద్ తోమర్, దర్మేంద్ర ప్రధాన్‌లు సభ్యులుగా ఉంటారు. కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్ సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై జీఓఎం రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనుంది. మరోవైపు జమ్ము కశ్మీర్‌లో సాధారణ పరిస్థితి నెలకొనేలా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌ను ప్రకటించనుందనే వార్తలు వస్తున్న క్రమంలో జీఓఎం ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో కశ్మీరీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.