భారత్‌-పాక్‌ టెన్షన్‌: మళ్లీ స్పందించిన చైనా | China Again Calls for India and Pakistan to exercise restraint | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్‌ టెన్షన్‌: మళ్లీ స్పందించిన చైనా

Published Wed, Feb 27 2019 1:32 PM | Last Updated on Wed, Feb 27 2019 1:35 PM

China Again Calls for India and Pakistan to exercise restraint - Sakshi

బీజింగ్‌: భారత వైమానిక దాడులు.. ప్రతిగా పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలతో దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల అంశంపై పొరుగుదేశం చైనా మరోసారి స్పందించింది. ఈ సమయంలో ఇరుదేశాలూ సంయమనంతో వ్యవహరించాలని కోరుతున్నట్టు పునరుద్ఘాటించింది. బీజింగ్‌లో సాధారణ విలేకరుల సమావేశంలో భాగంగా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్‌ ఈ వ్యాఖ్య చేశారు. పాక్‌ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడం.. భారత యుద్ధ విమానాలను కూల్చేసినట్టు పాక్‌ ఆర్మీ ప్రకటించడం.. మరోవైపు భారత్‌ దాయాదికి చెందిన ఎఫ్‌-16 విమానాన్ని కూల్చేయడం.. తదితర పరిణామాలతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement