
లక్నో: భారత్ బలహీన దేశం కాదని చైనా అర్థం చేసుకుంటోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ సరిహద్దులు పూర్తి సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో భారతీయ లోధి మహాసభ నిర్వహించిన కార్యక్రమానికి రాజ్‌నాథ్ హాజరై ప్రసంగించారు. చైనాతో నెలకొన్న సమస్య పరిష్కారమైందని తెలిపారు. భారత్‌ను విచ్ఛిన్నం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, మన భద్రతా దళాలు రోజూ ఐదు నుంచి పది మంది ఉగ్రవాదులను హతమార్చుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment