rajnadh singh
-
ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో - ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫోటోలు)
-
రేపే లోక్‌సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ మే 20న జరగనుంది. ఈ దశలో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలలో ఓటింగ్ జరగనుంది. పలువురు ప్రముఖులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యూపీలోని లక్నో లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అతనిపై సమాజ్‌వాదీ పార్టీ రవిదాస్ మెహ్రోత్రాను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. మంత్రిగా పనిచేసిన మెహ్రోత్రా ప్రస్తుతం లక్నో సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు.రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి దినేష్ ప్రతాప్ సింగ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం తన సీటును వదులుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని అమేథీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఇక్కడి నుంచి గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్ శర్మను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది.చిరాగ్ పాశ్వాన్ బీహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన ఎన్డీఏ కూటమిలోని ఎల్జేపీ (ఆర్)కి చెందిన నేత. కాగా ఇదే స్థానం నుంచి శివచంద్ర రామ్‌ను ఆర్జేడీ తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించింది.ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్‌లోని బారాముల్లా స్థానం నుంచి జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఒమర్‌పై మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ నుంచి ఫయాజ్ అహ్మద్ పోటీకి దిగారు. గత ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి అక్బర్ లోన్ ఈ స్థానంలో విజయం సాధించారు.ఐదో దశ ఎన్నికల పోరులో మోదీ ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు రంగంలోకి దిగారు. ముంబై నార్త్ నుండి పీయూష్ గోయల్, మోహన్‌లాల్‌గంజ్ నుండి కౌశల్ కిషోర్, లక్నో నుండి రాజ్‌నాథ్ సింగ్, అమేథీ నుండి స్మృతి ఇరానీ, ఫతేపూర్ నుండి సాధ్వి నిరంజన్ జ్యోతి, దిండోరి నుండి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, కోడెర్మా నుండి అన్నపూర్ణా దేవి, భివాండి నుండి కపిల్ పాటిల్ ఈ జాబితాలో ఉన్నారు. -
ఆయుధ పూజ చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
అరుణాచల్ ప్రదేశ్: విజయదశమి పర్వదినం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇక్కడికి నాలుగు సంవత్సరాల క్రితం వచ్చానని, అప్పుడు జవానులతో కలిసి విజయదశమి జరుపుకోవాలని అనుకున్నానని, దేశ భద్రతకు బాధ్యత వహిస్తున్న సైనికులను చూసి గర్వపడుతున్నానని అన్నారు. తవాంగ్ చేరుకునే మందు రక్షణ మంత్రి అస్సాంలోని తేజ్‌పూర్ సందర్శించారు. అక్కడి నాలుగు కార్ప్స్ హెడ్‌క్వార్టర్స్‌సైనికులతో సంభాషించారు. ఇక్కడ అన్ని స్థాయిల సైనికులు ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి భోజనం చేయడాన్ని రాజ్‌నాథ్ ప్రశంసించారు. వివిధ రాష్ట్రాలు, మతాలు, నేపథ్యాల నుండి వచ్చిన సైనికులు ఒకే బ్యారక్స్, యూనిట్లలో కలిసి పని చేయడం భారత సైన్యానికున్న ఐక్యతను తెలియజేస్తుందన్నారు. ఇది కూడా చదవండి: రావణుని వైభోగం ఎంత? అవశేషాలు ఎక్కడున్నాయి? विजयादशमी के पावन अवसर पर तवाँग में ‘शस्त्र पूजा’। https://t.co/JIYcBbd1no — Rajnath Singh (@rajnathsingh) October 24, 2023 -
చైనా సేనలను తరిమికొట్టాం
న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన సైన్యం పూర్తిస్థాయిలో తిప్పికొట్టిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్ట్సే ప్రాంతం వద్ద వాస్తవాధీన రేఖను దాటేందుకు, తద్వారా యథాతథ స్థితిని మార్చేందుకు డిసెంబర్ 9న చైనా సైన్యం ప్రయత్నించింది. వాటన్నింటినీ మన సైనికులు చాలా గట్టిగా తిప్పికొట్టారు. మన సైనిక కమాండర్లు సకాలంలో స్పందించడంతో చైనా సైన్యం తోక ముడిచింది’’ అని చెప్పారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆయన వేర్వేరుగా ప్రకటన చేశారు. ‘‘ఈ ఘర్షణ ఇరు సైనికుల నడుమ భౌతిక పోరుకూ దారి తీసింది. మనవాళ్లు వీరోచితంగా పోరాడారు. మన భూభాగాల్లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం చేసిన ప్రయత్నాలను వమ్ము చేసి వారిని తరిమికొట్టారు’’ అని వివరించారు. ‘‘ఈ ప్రయత్నంలో మనవైపు ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. కొందరు సైనికులు స్వల్పంగా గాయపడ్డారు’’ అని స్పష్టం చేశారు. ‘‘ఈ ఘటన తర్వాత మన స్థానిక సైనిక కమాండర్, చైనా కమాండర్ మధ్య డిసెంబర్ 11న ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. దీనిపై మన ఆగ్రహాన్ని, అభ్యంతరాలను దౌత్య మార్గాల్లో కూడా చైనాకు తెలియజేశాం. ఇలాంటి దుందుడుకు చర్యలను పునరావృతం చేయొద్దని, సరిహద్దుల వెంబడి శాంతి, సామరస్యాలను కాపాడాలని గట్టిగా చెప్పాం’’ అని వెల్లడించారు. ‘‘మన భూభాగాన్ని ఆక్రమించేందుకు జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా పూర్తిగా తిప్పికొట్టేందుకు, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైన్యం నిత్యం సన్నద్ధంగా ఉంది. సభకు ఈ మేరకు హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. అంతకుముందు తాజా పరిస్థితిపై సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సమీక్ష జరిపారు. గల్వాన్ తరహా ఘర్షణ ► డిసెంబర్ 9 నాటి చైనా ఆక్రమణ యత్నం మరోసారి రెండేళ్లనాటి ‘గల్వాన్ లోయ’ ఉదంతాన్ని తలపించింది. విశ్వసనీయ సమాచారం మేరకు... చైనా సైనికులు అచ్చం అప్పటి మాదిరిగానే ఇనుప ముళ్లతో కూడిన లావుపాటి ఆయుధాలు, కర్రల వంటివాటితో దాడికి దిగారు. అప్పట్లాగే పరిస్థితి మరోసారి బాహాబాహీకి కూడా దారితీసింది. ► తవాంగ్ పరిసరాల్లో యాంగ్ట్సే వద్ద 17 వేల అడుగుల పై చిలుకు ఎత్తున్న మంచు శిఖరాలపై పట్టు కోసం చైనా ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దాదాపు రెండేళ్ల అనంతరం మరోసారి మన భూభాగాల్లోకి సైలెంటుగా చొచ్చుకొచ్చేందుకు డిసెంబర్ 9న దొంగ ప్రయత్నం చేసింది. ► అయితే అక్కడ ఎటు చూసినా మన సైన్యం భారీగా మోహరించిన తీరుతో చైనా దళాలు అవాక్కైనట్టు సమాచారం. వాటి చొరబాటు యత్నాలను మనవాళ్లు దీటుగా అడ్డుకోవడమే గాక పూర్తిస్థాయిలో తరిమి కొట్టారు. ► ఆ ప్రాంతంలో భారత సైన్యపు మోహరింపులు హై రిజల్యూషన్ కెమెరాలతో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ► 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ లోయ వద్ద చైనా, భారత దళాల మధ్య జరిగిన భీకర పోరు జరగడం తెలిసిందే. దానివల్ల ఇరుదేశాల సంబంధాలు బాగా క్షీణించాయి. ► అప్పటినుంచి తూర్పు ప్రాంతంలో వాస్తవా ధీన రేఖ వద్ద మోహరింపులను, యుద్ధ సన్నద్ధతను సైన్యం బాగా పెంచింది. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. ► ఆ తర్వాత ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న పెద్ద ఘర్షణ ఇదే. ఈ దురాక్రమణ యత్నంలో చైనా వైపు చాలామంది సైనికులు గాయపడ్డట్టు సమాచారం. ► 2012 అక్టోబర్‌లో కూడా యాంగ్ట్సే ప్రాంతంలోనే భారత, చైనా సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ► కొంతకాలంగా ఈ ప్రాంతంలో చైనా డ్రోన్ల హడావుడి బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా రగడకు ముందే మన యుద్ధ విమానాలు తవాంగ్ పరిసరాల్లో గస్తీ కాయడం, డేగ కళ్లతో నిఘా వేయడం మొదలైంది. ► దాదాపు 3,500 కిలోమీటర్ల పొడవైన నియంత్రణ రేఖ పొడవునా పరిస్థితిపై, దళాల సన్నద్ధతపై త్రివిధ దళాధిపతులు సమీక్ష జరిపారు. భారత సైనికులు అడ్డుకున్నందుకే...తవాంగ్ రగడ: చైనా సైన్యం ‘గల్వాన్ లోయ’ చేదు అనుభవం నేపథ్యంలో తవాంగ్ రగడపై చైనా ప్రభుత్వ ఆచితూచి స్పందించగా సైన్యం మాత్రం తెంపరి వ్యాఖ్యలకు దిగింది! సరిహద్దుల వెంబడి పరిస్థితి నిలకడగా ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘‘భారత దళాలే అక్రమంగా ఎల్ఓసీ దాటాయి. చైనా వైపు డాంగ్జాంగ్ ప్రాంతంలో గస్తీ విధుల్లో ఉన్న మా సైనికులను అడ్డుకున్నాయి. అది డిసెంబర్ 9 రగడకు దారి తీసింది’’ అని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) వెస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి కల్నల్ లోంగ్ షోహువా ఆరోపించారు. నిజాలు దాస్తున్న కేంద్రం రాజ్‌నాథ్‌ది అరకొర ప్రకటన: కాంగ్రెస్ ‘తవాంగ్’పై అట్టుడికిన ఉభయసభలు కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాల వాకౌట్ తవాంగ్ రగడ మంగళవారం పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. చైనాను నిలువరించడంలో కేంద్రం సమర్థంగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలన్నీ దుయ్యబట్టాయి. ‘‘ఇది కచ్చితంగా దౌత్య వైఫల్యమే. సరిహద్దుల వద్ద పరిస్థితిపై తక్షణం సవివర చర్చకు ప్రభుత్వం సిద్ధపడాలి’’ అని డిమాండ్ చేశాయి. రాజ్‌నాథ్ ప్రకటనపై వివరణకు పట్టుబట్టాయి. ఇది సున్నితమైన అంశమంటూ వివరణ కోరేందుకు రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా అనుమతివ్వలేదు. అందుకు నిరసనగా కాంగ్రెస్, ఎస్పీ, జేఎంఎం, ఆర్జేడీ, శివసేన, సీపీఎం, సీపీఐ ఉభయ సభల నుంచీ వాకౌట్ చేశాయి. అనంతరం రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. చైనా సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్) గుర్తింపు రద్దు అంశాన్ని కావాలని మోదీ సర్కారు తెరపైకి తెస్తోందని ఆరోపించారు. ఉభయ సభల్లో వివరణ ఇవ్వకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. చైనా దురాక్రమణ, ఉగ్రవాదం దేశ భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు పెను ముప్పుగా మారుతున్నా మౌన ప్రేక్షకునిగా చూస్తోందంటూ దుయ్యబట్టారు. మంత్రుల వెనక దాక్కుంటున్న మోదీ చైనా అంశంపై ప్రభుత్వ వ్యవహార శైలిని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తవాంగ్ రగడపై రక్షణ మంత్రి అరకొర ప్రకటనతో సరిపెట్టారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. దీనిపై మోదీ ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని పార్టీ నేతలు గౌరవ్ గొగొయ్, పవన్ ఖేరా ఆరోపించారు. ‘‘డిసెంబర్ 9న ఘర్షణ జరిగితే రక్షణ మంత్రి ప్రకటనకు ఇంత ఆలస్యమెందుకు? ప్రజల నుంచి ఏం దాస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. జాతీయ భద్రత అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా మోదీ తన మంత్రుల వెనక దాక్కుంటారని ఎద్దేవా చేశారు. పీఎం కేర్స్ నిధికి విరాళాలిచ్చిన చైనా కంపెనీల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అంగుళం కూడా వదలం: అమిత్ షా రాజీవ్ ఫౌండేషన్‌కు చైనా నిధులు దాని గుర్తింపు రద్దయినందుకే నిరసనలు కాంగ్రెస్‌కు హోం మంత్రి చురకలు మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత భూభాగంలో ఎవరూ ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎలాంటి చొరబాట్లనూ అనుమతించబోమన్నారు. ‘లోక్‌సభలో కార్యకలాపాలను కాంగ్రెస్ పదేపదే అడ్డుకోవడానికి అసలు కారణం తవాంగ్ రగడ కాదు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్)కు విదేశీ విరాళాల చట్టం (ఎఫ్సీఆర్ఏ) గుర్తింపును కేంద్రం రద్దు చేయడమే!’’ అంటూ చురకలంటించారు. ‘‘సమాజ సేవ కోసమంటూ నమోదు చేసుకున్న ఆర్జీఎఫ్కు ఇండో–చైనా సంబంధాల అభివృద్ధి సంబంధిత అధ్యయనం పేరిట చైనా ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లు అందాయి. అందుకే దాని గుర్తింపు రద్దు చేయాల్సి వచ్చింది. విపక్షాల గొడవ వల్ల ప్రశ్నోత్తరాలు తుడిచిపెట్టుకుపోయాయి. లేదంటే ఈ విషయాన్ని సభలోనే చెప్పేవాన్ని. బహుశా ఆర్జీఎఫ్ తన అధ్యయనం ముగించే ఉంటుంది. ఇంతకూ, 1962 చైనా యుద్ధంలో ఎన్ని వేల హెక్టార్ల భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించిందన్నది ఆ అధ్యయనంలో ఉందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. చైనాపై మోదీ ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. నిజానికి విదేశీ నాయకులతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాధినేతలకు ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే ఐరాస భద్రతా మండలిలో స్థానం చేజారిందంటూ ప్రత్యారోపణ చేశారు. ‘‘భద్రతా మండలిలో భారత్ స్థానాన్ని కాంగ్రెస్‌కు చెందిన దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎందుకు ‘త్యాగం’ చేశారు? కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్సింగ్ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తే చైనా అభ్యంతరపెట్టింది. ఆ రాష్ట్ర సీఎం దోర్జీ ఖండూకు వీసా నిరాకరించింది. జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ అక్కడి ప్రజలకు స్టేపుల్ వీసాలిచ్చింది. వీటన్నింటిపై కూడా ఆర్జీఎఫ్ అధ్యయనం చేసిందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ సారథ్యంలోని ఆర్జీఎఫ్కు ఉగ్రవాదులతో లింకుల ఆరోపణలపై నిషేధం ఎదుర్కొంటున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ నుంచి కూడా రూ.50 లక్షలందాయని ఆరోపించారు. -
దేశమంతటా ‘అగ్ని’గుండం
ఢిల్లీ: సైనిక దళాల్లో నియామకాలకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం అగ్నిపథ్ రాజేసిన అగ్గి కార్చిచ్చుగా మారి దేశమంతటినీ కమ్మేసింది. పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత చేపట్టిన నిరసనలు, ఆందోళనలు శుక్రవారం మూడో రోజు తారస్థాయికి చేరాయి. రైల్వేస్టేషన్లను ముట్టడించడం, హైవేలను దిగ్బంధించడంతో పాటు చాలాచోట్ల హింసాకాండ కూడా చోటుచేసుకుంది. బిహార్, యూపీ మొదలుకుని పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ... ఇలా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. కోపోద్రిక్తులైన యువకులు పలు రాష్ట్రాల్లో 7 రైళ్లకు, వందలాది వాహనాలకు నిప్పుపెట్టారు. గంటల తరబడి రోడ్లపై, పట్టాలపై బైఠాయించారు. రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వాటిపైకి రాళ్లు రువ్వారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు టోల్ ప్లాజాలను కూడా ధ్వంసం చేశారు. పలుచోట్ల రైల్వేస్టేషన్లలో విధ్వంసానికి పాల్పడ్డారు. బిహార్‌లో ఉప ముఖ్యమంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుని నివాసాలపై దాడికి దిగారు. బీజేపీకి, కేంద్రానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. ‘అగ్నిపథ్‌ను వెనక్కు తీసుకోవాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. లాఠీచార్జీలో వందలాది మంది గాయపడ్డారు. యువత భవిష్యత్తును అంధకారంగా మార్చే ఈ పథకాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆందోళనలు, విధ్వంసాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 200కు పైగా రైళ్లు రద్దయ్యాయి. 300 పై చిలుకు రైళ్ల రాకపోకలు ప్రభావితమయ్యాయి. చాలాచోట్ల ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ వంటి సేవలను నిలిపేయాల్సి వచ్చింది. యువతను శాంతింపజేసేందుకు కేంద్రం హుటాహుటిన రంగంలోకి దిగినా పెద్దగా ఫలితం కనిపించలేదు. అగ్నిపథ్ అన్నివిధాలా ఆలోచించి రూపొందించిన పథకమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరించారు. పైగా దీనికింద సైనిక దళాల్లో చేరేందుకు గరిష్ట వయో పరిమితిని ఈ ఏడాదికి 23 ఏళ్లకు పెంచడం యువతకు సువర్ణావకాశమని వారన్నారు. నాలుగేళ్ల సర్వీసు అనంతరం పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రైవేటు రంగంలో చక్కని ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అయినా యువత శాంతిస్తున్న సూచనలు గానీ, ఆందోళనలు తగ్గుముఖం పడుతున్న జాడలు కానీ కన్పించడం లేదు. పైగా అగ్నిపథ్ నియామకాలకు అతి త్వరలో శ్రీకారం చుడుతున్నట్టు ర్రివిధ దళాధిపతులు ప్రకటించిన నేపథ్యంలో ఆందోళనలు మరింతగా పెరిగేలా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకంపై శనివారం త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సమావేశమై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. యూపీ, బెంగాల్, ఒడిశాల్లో... యూపీలో కనీసం 17 నగరాల్లో భారీ ఆందోళనలు జరిగాయి. బలియాలో రాష్ట్ర రవాణా మంత్రి క్యాంపు కార్యాలయంపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఓ రైలుకు నిప్పు పెట్టారు. అలీగఢ్ వద్ద హైవేపై పలు బస్సులపై రాళ్లు రువ్వారు. వారణాసి, ఫిరోజాబాద్, అమేథీ తదితర చోట్ల పలు రైళ్లపై దాడికి పాల్పడటంతో పాటు రాళ్లు రువ్వినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో రైల్వేస్టేషన్ ముట్టడి సందర్భంగా కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. ఢిల్లీ, బెంగాల్, ఒడిశాల్లో హైవేల దిగ్బంధం జరిగింది. అట్టుడికిన బిహార్... అగ్నిపథ్ ఆందోళనతో బిహార్ అట్టుడికింది. రాజధాని పట్నా, హాజీపూర్, సమస్తిపూర్, లఖీసరాయ్ వంటి పలు పట్టణాల్లో రైళ్లకు నిప్పుపెట్టారు. దాంతో 10 ఇంజన్లతో పాటు 60 కోచ్‌లకు పైగా దగ్ధమయ్యాయి. హైవేలపై టైర్లు తదితరాలు తగలబెట్టి రాకపోకలను స్తంభింపజేశారు. శనివారం రాష్ట్ర బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పట్నా శివార్లలో ఓ టోల్ ప్లాజా, నవడాలో ఓ పోలీసు జీపుకూ నిప్పు పెట్టారు. పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలో ఉప ముఖ్యమంత్రి రేణూ దేవి ఇంటిపై దాడి చేశారు. బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ఇంటిని పాక్షికంగా ధ్వంసం చేశారు. తన ఇంటిని పేల్చేసేందుకు సిలిండర్ బాంబు కూడా పెట్టారని ఆయన ఆరోపించారు. మోతీహారీలో బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహారీ కారును తగలబెట్టారు. 320 మందిని అరెస్టు చేసినట్టు అదనపు డీజీపీ సంజయ్‌సింగ్ తెలిపారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను రెండు రోజుల పాటు నిలిపేశారు. -
ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్షాల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం పట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటుదాని మిత్రపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బ్రిటీష్ హయాం నుంచీ ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయని, సామాన్యుల సమస్యలు లేవనెత్తేందుకు ప్రశ్నోత్తరాలు కీలకమని కాంగ్రెస్ లోక్‌సభపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలు తొలగించి కొత్త సంప్రదాయానికి తెరలేపారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు చేపట్టాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. సభలో ఎన్నికైన సభ్యులు ప్రశ్నించడం ప్రాథమిక హక్కని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. విపక్షాలు నిరసనల నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా కల్పించుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కరోనా నుంచి మన దేశం త్వరగా కోలుకోవాలని అభిప్రాయపడ్డారు. (ఎంపీలు రెడ్డప్ప, మాధవిలకు పాజిటివ్) చరిత్రలో తొలిసారి ఈ విధంగా సమావేశాలు జరుగుతున్నాయని, అసాధారణ పరిస్థితుల్లో జరిగే సమావేశాలకు సహకరించాలని స్పీకర్ సభ్యులను కోరారు. మధ్యలో పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ కల్పించుకుని సభ్యులకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రశ్నలు లేవనెత్తేందుకు వివిధ రకాల విధానాలు ఉన్నాయన్నారు. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్ష సభ్యులతోనూ ముందే చర్చించామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గుర్తుచేశారు. సభ్యుల ప్రశ్నలకు తప్పకుండా సమాధానం చెబుతామన్నారు. సభ సజావుగా సాగేందుకు అందరి సహకారం అవసరమని రాజ్‌నాథ్ విజ్ఞప్తి చేశారు. (పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం). -
భారత్, చైనా మధ్య ‘యుద్ధాటకం’
సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం, అంటే 1975 సంవత్సరం తర్వాత భారత్, చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద మొట్టమొదటి సారి కాల్పుల కలకలం చెలరేగింది. సెప్టెంబర్ ఏడవ తేదీన భారత వాస్తవాధీన పరిధిలోకి చొచ్చుకు వస్తోన్న చైనా సైనికులను భారత సైనికులు అడ్డగించినందుకు చైనా సైనికులు గాలిలోకి కాల్పులు జరిపారని భారత మీడియా పేర్కొనగా, భారత సైనికులే కాల్పులు జరిపారని చైనా మీడియా ఆరోపించింది. గత మే నెల నుంచి ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు చైనా సైనికులు సష్టించిన హింసాకాండలో 20 మంది భారత సైనికులు మరణించడంతో ఒక్కసారిగా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆ పరిస్థితి చివరకు చైనా వస్తువుల బహిష్కరణ, చైనా యాప్‌లపై నిషేధం దాకా కొనసాగింది. (దక్షిణాన సైనికులు.. ఉత్తరాన నిర్మాణాలు) ఈలోగా సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణ కోసం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య చర్యలు ఫలితాలిస్తున్నట్లుగానే కనిపించాయి. ఇంతలో కాల్పుల కలకలం చెలరేగడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరుకున్నాయి. మాస్కోలో జరుగుతోన్న ‘శాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్’ సమ్మేళనంలో పాల్గొనేందుకు మాస్కో నగరానికి వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ అక్కడ ఈ రోజు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ముఖాముఖి సమావేశమై శాంతి కోసం చర్చలు జరపనున్నారు.(ముదురుతున్న వివాదం) ‘సరిహద్దుల్లో కొంచెం మేఘాలు కమ్ముకున్నాయి’ అని జై శంకర్ మాస్కో వెళ్లే ముందు భారత మీడియాతో వ్యాఖ్యానించారు. వారం రోజుల క్రితమే కేంద్ర ర క్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రిని కలుసుకొని చర్చలు సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చలు జరిపారు. అయినప్పటికీ కాల్పుల కల్లోలం చెలరేగడంతో విదేశాంగ మంత్రులు దౌత్యపరమైన చర్చలను చేపట్టాల్సి వచ్చింది. చైనాతో వ్యాపార సంబంధాల పునరుద్ధరణ, చైనా ఆప్‌లపై నిషేధం ఎత్తివేత అంశాలను చైనా ప్రస్తావిస్తే అందుకు స్పందిస్తారా ? అని భారత మీడియా ప్రశ్నించగా, లేదని, తాను చర్చల్లో కేవలం సరిహద్దు ఉద్రిక్తతలకే పరిమితం అవుతానని ఆయన సమాధానం చెప్పారు. ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు దట్టమవుతున్నాయని, విదేశాంగ మంత్రుల చర్చలు విఫలమైతే ఇరు దేశాల మధ్య పరిమిత యుద్ధమైన జరుగుతుందని జాతీయ మీడియాలో మెజారిటీ అభిప్రాయపడుతోంది. అమెరికాతో అంటకాగుతున్న భారత్‌ను తనవైపు తిప్పుకునేందుకు, ముఖ్యంగా చైనా ఉత్పత్తుల దిగుమతి పునరుద్ధరణ కోసం సరిహద్దు ఉద్రిక్తతలకు చైనా పాల్పడుతోందని మీడియాలో ఓ వర్గం భావిస్తుండగా, అణ్వస్త్రాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశమే లేదని, తమ తమ దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి సష్టిస్తోన్న కల్లోల పరిస్థితుల నుంచి ప్రజల దష్టిని మళ్లించేందుకు భారత్, చైనాలు కూడబల్కోని ఆడుతున్న ‘యుద్ధ నాటకం’ అని మీడియాలో మరో వర్గం అనుమానిస్తోంది. -
భారత్, చైనా మిలటరీ చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో తాజాగా నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్, చైనా మరో దఫా సైనిక చర్చలు చేపట్టాయి. సరిహద్దులో భారత్ వైపున్న చుషుల్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారుల చర్చలు ప్రారంభమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాంగాంగ్ సరస్సు వద్ద యథాతథ స్థితిని కొనసాగిం చాలన్న నిర్ణయానికి తూట్లు పొడుస్తూ సోమవారం చైనా మిలిటరీ దుస్సాహసానికి దిగిన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో చైనా బలగాలు భారత్ వైపునకు చొచ్చుకొని వచ్చి దురాక్రమణకు యత్నించాయి. రాజ్‌నాథ్ సమీక్ష రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లద్దాఖ్‌లో పరిస్థితులపై మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్, త్రివిధ దళాల అధిపతులు దీనికి హాజరయ్యారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని కీలక ప్రాంతాలకు అదనపు బలగాలను, ఆయుధ సంపత్తిని తరలించారు. ఈ ప్రాంతంలో భారత్ ఆధిపత్యం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. వాస్తవా ధీన రేఖ వద్ద గగనతలంలో చైనా కదలికలపై నిఘాను మరింత పెంచాలని భారత వాయుసేనకు ఆదేశాలు వెళ్లినట్లు చెప్పాయి. అందుకే వివాదాలు: చైనా మంత్రి భారత్, చైనా సరిహద్దులో ఒకవైపు ఉద్రిక్తతలు నెలకొనగా మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా సరిహద్దుల్ని ఇంకా నిర్ణయించలేదని, అందుకే ఎప్పుడూ సమస్యలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించా రు. ఇరు దేశాల నాయకత్వం విభేదాలు వివాదాలుగా మారకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు. భారత్‌తో అన్ని అంశాలపై చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఒప్పందాల ఉల్లంఘనే: భారత్ తాజాగా చైనా బలగాలు వాస్తవాధీన రేఖ వద్ద పాల్పడిన దుందుడుకు చర్యపై భారత్ స్పందించింది. పాంగాంగ్ దక్షిణ తీరంలో యథాతథ స్థితిని పాటించాలంటూ కుదిరిన ఒప్పందాలను చైనా లక్ష్యపెట్టలేదని స్పష్టం చేసింది. ఆగస్టు 29, 30న పాంగాంగ్ దక్షిణ తీరంలో ఆ దేశ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయంది. ఒప్పందాలను గౌరవించకుండా చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ చెప్పారు. వాస్తవాధీన రేఖ (ఎల్ ఏసీ) వద్ద దేశ ప్రయోజనాలను, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు భారత బలగాలు సరైన రక్షణాత్మక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దులో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఇరుదేశాల కమాండర్లు చర్చలు జరుపుతుండగానే చైనా కవ్వింపు చర్యలకు దిగిందన్నారు. -
మన సరిహద్దు క్షేమం
న్యూఢిల్లీ: మన భూభాగంలోకి ఎవరూ రాలేదని, సరిహద్దు క్షేమమని, మన ఆర్మీ పోస్ట్‌లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చైనా సాగించిన దురాగతానికి యావద్దేశం గాయపడిందని, ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్ శాంతిని, స్నేహ సంబంధాలనే కోరుకుంటుందని, అదే సమయంలో, దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదని, అదే మనకు సర్వోన్నతమని స్పష్టం చేశారు. సరిహద్దులను కాపాడే విషయంలో సైన్యం సమర్ధంగా వ్యవహరిస్తోందన్నారు. అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. వాస్తవాధీన రేఖకు సంబంధించి భారత్ విధానాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాకు స్పష్టం చేశామని ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలతో పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు అమరులై, చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని∙మోదీ శుక్రవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని భేటీలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర ప్రధాన పార్టీల అగ్రనేతలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాల్వన్ లోయలో జూన్ 15 రాత్రి చైనా సైనికులతో చోటు చేసుకున్న ఘర్షణ తదనంతర పరిణామాలను, ప్రస్తుత పరిస్థితిని మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జై శంకర్ పార్టీల నేతలకు వివరించారు. చైనాతో వ్యవహరించాల్సిన తీరుపై దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ భేటీలో వివిధ పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొదట, చైనాతో సరిహద్దు ఘర్షణల్లో అమరులైన 20 మంది వీర జవాన్లకు ప్రధాని, మంత్రులు, పార్టీల నేతలు 2 నిమిషాల పాటు మౌనం పాటించి, నివాళులర్పించారు. జవాన్ల త్యాగం వృధా కాబోదని ప్రధాని పునరుద్ఘాటించారు. భారత్ వైపు చూసే ధైర్యం చేసినవారికి మన వీర జవాన్లు తగిన గుణపాఠం చెప్పారని ప్రధాని వ్యాఖ్యానించారు. గాల్వన్ లోయ, ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాల్లోని భారత భూభాగాల్లోకి చైనా సైనికులు చొచ్చుకువచ్చారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని వివరణ ఇచ్చారు. మన భూభాగంలో ఒక అంగుళాన్నైనా ఎవరూ ఆక్రమించుకునే ధైర్యం చేయలేనంత స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందించుకున్నామన్నారు. ఈ భేటీలో ఎన్సీపీ నేత శరద్‌పవార్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కే చంద్ర శేఖర రావు, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ, డీఎంకే నేత స్టాలిన్, బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, సీపీఎం నేత సీతారాం యేచూరి పాల్గొన్నారు. చైనా పెట్టుబడులు వద్దు: మమత భారత్‌లోని మౌలిక వసతుల రంగంలో చైనా పెట్టుబడులను అంగీకరించవద్దని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సూచించారు. ఈ సంక్షోభ సమయంలో తమ పార్టీ కేంద్రానికి మద్దతుగా నిలుస్తుందన్నారు. కమిటీ ఏర్పాటు చేస్తారా?: యేచూరి చైనాతో సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడ్డానికి, 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడానికి నిఘా వైఫల్యం కారణమా అని తేల్చేందుకు ఏదైనా కమిటీని నియమిస్తారా? అని సీపీఎం నేత సీతారాం యేచూరి ప్రశ్నించారు. గతంలో కార్గిల్ వార్ అనంతరం.. వైఫల్యాలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఒక కమిటీ వేసిన విషయాన్ని యేచూరి గుర్తు చేశారు. మీ సైనికులెవరూ మా ఆధీనంలో లేరు:చైనా బీజింగ్: భారతీయు సైనికులు ఎవరూ ‘ప్రస్తుతం‘తమ ఆధీనంలో లేరని చైనా శుక్రవారం స్పష్టం చేసింది. తూర్పు లడాఖ్ సరిహద్దుల్లో జూన్ 15న భారత్ చైనాల మధ్య ఘర్షణలో పొరుగుదేశం మన సైనికులను బందీలుగా చేసి తీసుకెళ్లిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ మీడియాకు ఈ విషయం తెలిపారు. నిఘా వైఫల్యమా?: సోనియా సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల్లో 20 మంది భారత జవాన్ల మృతికి నిఘా వైఫల్యం కారణమా? అని సోనియాగాంధీ ప్రశ్నించారు. గాల్వన్ లోయలో యథాతథ స్థితి నెలకొంటుందని, చైనా వెనక్కు వెళ్తుందని హామీ ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరారు. భేటీ ప్రారంభంలో సోనియా పలు ప్రశ్నలను సంధించారు. చైనా దళాలు తూర్పు లద్దాఖ్‌లో భారత భూభాగంలోకి వచ్చాయా? వస్తే ఎప్పుడు వచ్చాయి? ఆ ప్రాంతంలో చైనా దళాల అసాధారణ కదలికలపై మన నిఘా సంస్థలు సమాచారం ఇవ్వలేదా? అని ఆమె ప్రశ్నించారు. తదుపరి కార్యాచరణ ఏమిటన్నారు. సైనికుల మధ్య ఘర్షణలు ప్రారంభమైన మే 5 నుంచి జూన్ 6 వరకు విలువైన కాలాన్ని ప్రభుత్వం వృధా చేసిందని ఆరోపించారు. మమ్మల్ని ఆహ్వానించరా? ఈ భేటీకి ఆహ్వానించకపోవడంపై ఆప్, ఆర్జేడీ, ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరాయి. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్‌యాదవ్, ఆయన కూతురు మీసాభారతి, ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బిహార్‌లో తమది ప్రధాన ప్రతిపక్షమని, ఈ భేటీకి ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. అయితే, అన్ని గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, లోక్‌సభలో ఐదుగురు, లేదా ఆపై ఎంపీలున్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు, కేబినెట్లో మంత్రులున్న పార్టీలను మాత్రమే భేటీకి ఆహ్వనించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లేహ్‌లో ఐఏఎఫ్ చీఫ్ భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో.. భారత వైమానిక దళాధిపతి చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా లేహ్, శ్రీనగర్‌ల్లో పర్యటించారు. ఎయిర్‌ఫోర్స్ సన్నద్ధతను పరిశీలించారు. -
లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ మే 3తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.. లేక ఆంక్షలను సడలిస్తారా అనేది కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. ఈ క్రమంలోనే శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఆయన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ భేటీతో అయ్యారు. ఈ ప్రధాన భేటీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్‌తో పాటు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా, సీడీఎస్ బిపిన్ రావత్ కూడా పాల్గొన్నారు. (లాక్డౌన్ : తెలంగాణ నుంచి తొలి ట్రైన్) లాక్‌డౌన్‌పై అనుసరించాల్సిన వ్యూహాలు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రముఖంగా చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కరోనాపై జరుగుతున్న పోరులో మే నెల అత్యంత కీలకమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. హాట్‌స్పాట్స్‌ను కఠినంగా నియంత్రించడం, గ్రీన్‌జోన్స్‌ను సురక్షితంగా కాపాడుకోవడమన్న రెండు అంశాలు అమీతుమీ తేల్చేస్తాయని అభిప్రాయపడ్డారు. రైల్వే, విమాన ప్రయాణం, అంతర్రాష్ట బస్సు సర్వీసులను మే నెల మొత్తం బంద్ చేయడమే మేలని స్పష్టం చేశారు. ఇదే విషయంపై ప్రధాని మోదీ శనివారం ప్రసంగంలో చర్చించే అవకాశం ఉంది. ఇక వైరస్ ప్రభావిత ప్రాంతాలను గుర్తిస్తూ కొత్తగా రెడ్, ఆరెంజ్ జోన్లను కేంద్రం గుర్తించిన విషయం తెలిసిందే. (ఠాక్రేకు గుడ్‌న్యూస్ : ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కరోనాపై ‘కంటికి కనిపించని యుద్ధం’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ కష్ట సమయంలో త్రివిధ దళాలను, వ్యూహాత్మక సంపత్తిని కాపాడుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న భద్రతా బలగాలు.. మరో వైపు సరిహద్దుల రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదని తెలిపారు. ఆదివారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. కరోనాపై పోరాటాన్ని దేశం చేస్తున్న ‘అతిపెద్ద అదృశ్య యుద్ధం’గా ఆయన అభివర్ణించారు. ‘కోవిడ్–19పై సాగిస్తున్న పోరు అతిపెద్ద అదృశ్య యుద్ధం. మానవత్వంపై జరుగుతున్న యుద్ధం. దేశ ఆర్థిక భద్రత, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే యుద్ధం’అని ఆయన అన్నారు. ఉగ్ర శిబిరాలపై దాడులు యథాతథం జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా సైన్యం దాడులు కొనసాగుతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. పాక్ చొరబాటుదారులు సరిహద్దులు దాటి దేశంలోకి రాకముందే వారిని సైన్యం అడ్డుకుంటుందని తెలిపారు. కోవిడ్–19 నుంచి కాపాడుకునే విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం, ఆరోగ్య శాఖ, వైద్య సంస్థల సూచనలను త్రివిధ దళాలు పాటిస్తున్నాయన్నారు. నేవీ సిబ్బందికి కరోనా సోకిందన్న వార్తలు, కరోనా ప్రభావం సైనిక బలగాలపై పడుతుందన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
వారి కూటమితోనే మాకు భారీ విజయం..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ-ఎస్పీ కూటమే బీజేపీకి అత్యధిక స్థానాలకు సాధించిపెట్టిందని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. వారి కూటమిని ప్రజలను ఆమోదించలేదని, అందుకే తమ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందిందని అన్నారు. యూపీ రాజధాని లక్నో లోక్‌సభ స్థానం నుంచి రాజ్‌నాథ్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం ఆయన తొలిసారి అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. అధికారం కోసమే దశాబ్ధాల శత్రుత్వాన్ని పక్కనపెట్టి బీఎస్పీ,ఎస్పీలు కూటమి కట్టాయని, వారి కుట్రలను గమనించిన ప్రజలు మరోసారి తమకు అధికారం అప్పగించారని ఆయన పేర్కొన్నారు. యూపీలో 50శాతానికి పైగా ఓట్లు బీజేపీ సొంతం చేసుకుందని, ఆ రెండు పార్టీలు కలిసినా కనీసం 40శాతం ఓట్లుకూడా రాబట్టలేకపోయయన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయం మరో పార్టీలేదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. గత ఐదేళ్ల కాలంలో ప్రారంభించిన అనేక పథకాలను, ప్రాజెక్టులను ఖచ్చితంగా పూర్తిచేసి తీరుతామని హామీ ఇచ్చారు. కాగా యూపీలో బీజేపీ 62 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. -
జమిలి ఎన్నికలపై కమిటీ
న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై నిర్ణీత గడువులోగా సూచనలు ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం నాడిక్కడ ప్రకటించారు. నిర్దిష్ట కాలవ్యవధిలోగా భాగస్వామ్యపక్షాలతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని తెలిపారు. జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలని భావించిన మోదీ ఆ మేరకు 40 మందికి ఆహ్వానం పలికారు. అయితే 21 పార్టీలు మాత్రమే బుధవారం నాటి ఈ భేటీకి హాజరుకాగా మరో మూడు పార్టీలు ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాయి. అఖిలపక్ష నేతలతో సమావేశానంతరం రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలనేవి ప్రభుత్వ ఎజెండా కాదని, ఇది జాతి ఎజెండాగా ప్రధాని ఈ సమావేశంలో స్పష్టం చేశారన్నారు. ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాన్ని అయినా స్వాగతిస్తామని మోదీ చెప్పారన్నారు. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనకు చాలా పార్టీలు మద్దతు పలికాయని చెప్పారు. ఉమ్మడి ఎన్నికల కసరత్తు ఎలా జరుగుతుందనే దానిపై సీపీఐ, సీపీఎం వంటి పార్టీలకు భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, ఈ ఆలోచనను వారు నేరుగా వ్యతిరేకించలేదని తెలిపారు. పార్లమెంటు ఉత్పాదకత పెంచాలనే అంశంలో పార్టీలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయన్నారు. చర్చకు, సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా సభలో సుహృద్భావ వాతావరణం ఉండాలని అఖిల పక్షానికి హాజరైన నేతలు అభిప్రాయపడినట్లు తెలిపారు. కాగా కమిటీ కూర్పుపై ప్రధాని నిర్ణయం తీసుకుంటారని రాజ్‌నాథ్ చెప్పారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. ఇది రాజకీయ కమిటీ. వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇందులో సభ్యులుగా ఉంటారు. హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్ ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’తో పాటు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అయ్యే సందర్భంగా 2022లో ఉత్సవాలు నిర్వహించడం, అలాగే ఈ ఏడాది మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాలు నిర్వహించడం తదితర అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన ఈ సమావేశానికి ఎన్డీయే మిత్రపక్షం శివసేనతో పాటు పలు విపక్ష పార్టీలు హాజరుకాలేదు. గైర్హాజరైన ప్రముఖుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, డీఎంకే నేత ఎంకే స్టాలిన్, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ , బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉన్నారు. హాజరైన వారిలో ఎన్సీపీ నేత శరద్‌పవార్, సీతారాం ఏచూరి (సీపీఎం), సురవరం సుధాకర్‌రెడ్డి (సీపీఐ), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ నేత నవీన్ పట్నాయక్, సుఖ్బీర్ సింగ్ బాదల్ (శిరోమణి అకాలీదళ్), కోనార్డ్ సంగ్మా (నేషనల్ పీపుల్స్ పార్టీ) ఉన్నారు. పార్లమెంటు హౌస్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ భేటీలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరయ్యారు. మోదీ, రాజ్‌నాథ్‌లతో పాటు ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, బీజేపీ కొత్త కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధం: ఏచూరి అయితే జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, సమాఖ్యవాదానికి విరుద్ధమని, ఆ విధంగా అవి రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో సీతారాం ఏచూరి మాట్లాడారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దొడ్డిదారిన తొలగించడమేనని ఏచూరి పేర్కొన్నారు. అంతకుముందు సమావేశంలో జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం చేస్తున్న కృత్రిమ ప్రయత్నాన్ని సీపీఎం ఎందుకు వ్యతిరేకిస్తోందీ తెలియజేసే ఒక పత్రాన్ని పార్టీల ప్రతినిధులకు అందజేశారు. శాసనవ్యవస్థకు ప్రభుత్వాన్ని జవాబుదారీని చేసే రాజ్యాంగ ప్రక్రియను ఇది తారుమారు చేస్తుందని పేర్కొన్నారు. నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, డేటా విశ్వసనీయత తదితర అంశాలను కూడా ఆ పత్రంలో ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలికిన బీజేడీ నేత నవీన్ పట్నాయక్.. రాజ్యాంగ ప్రవేశికలో శాంతి, అహింస అనే పదాలను చేర్చాలని డిమాండ్ చేశారు. ఇది ప్రస్తుత ప్రాధాన్య అంశం కాదు: మాయావతి భారత్ వంటి అతిపెద్ద దేశానికి జమిలి ఎన్నికలనేవి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ ఆలోచనగా కనబడుతోందని మాయావతి పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం దేశం ముందున్న అంశం కాదని విమర్శించారు. ఈవీఎంలపై అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉంటే హాజరయ్యేదాన్నంటూ అంతకుముందు ట్వీట్ చేశారు. ఈ అంశంపై ఇతర పార్టీలతో సంప్రదింపుల అనంతరం అఖిలపక్షానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. తాను హాజరు కాబోనని మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అఖిల పక్షానికి బదులుగా దీనిపై చర్చలకు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. ప్రజా ధనాన్ని పొదుపు చేసేందుకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని గత ఏడాది ఆగస్టులో లా కమిషన్ సిఫారసు చేసింది. అయితే ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారమైతే ఇది సాధ్యం కాదని న్యాయశాఖకు సమర్పించిన ముసాయిదాలో హెచ్చరించింది. ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగానికి, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగంలోని కనీసం రెండు నిబంధనలను సవరించడంతో పాటు, మెజారిటీ రాష్ట్రాలు కనుక ఆమోదించిన పక్షంలో జమిలి ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించవచ్చని లా కమిషన్ తన సిఫారసుల్లో పేర్కొంది. లా కమిషన్ సిఫారసులతో మాజీ ప్రధాన ఎన్నికల అధికారి టీఎస్ కృష్ణమూర్తి ఏకీభవించారు. జమిలి ఎన్నికలు సాధ్యమేనని చెప్పారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, కానీ అవిశ్వాస తీర్మానం, దానితో ముడిపడిన అంశాలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన దీని అమలుకు పెద్ద అవరోధమని తెలిపారు. దీనికి పరిష్కారమార్గం రాజ్యాంగ సవరణ ఒక్కటేనని పేర్కొన్నారు. అలాగే ఈ విధంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల విధులకు అవసరమైన పారా మిలటరీ బలగాల సంఖ్యను పెంచడం సహా చాలా పాలనాపరమైన ఏర్పాట్లు అవసరమని చెప్పారు. భిన్నాభిప్రాయాలు స్వాగతిస్తాం : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ జమిలి ఎన్నికలనేవి ప్రభుత్వ ఎజెండా కాదు.. ఇది జాతి ఎజెండా అని ప్రధాని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాన్ని అయినా స్వాగతిస్తామని మోదీ చెప్పారు. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనకు చాలా పార్టీలు మద్దతు పలికాయి. ఉమ్మడి ఎన్నికల కసరత్తు ఎలా జరుగుతుందనే దానిపై సీపీఐ, సీపీఎం వంటి పార్టీలకు భిన్నాభిప్రాయం ఉన్నా, ఈ ఆలోచనను వారు నేరుగా వ్యతిరేకించలేదు. బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీకి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో ఒడిశా, బిహార్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, నితీశ్‌కుమార్, కేంద్ర మంత్రులు నడ్డా, రాజ్‌నాథ్, అమిత్ షా, గడ్కరీ తదితరులు -
అన్ని మంత్రివర్గ సంఘాల్లోనూ ఆయనకు చోటు
కేంద్రంలో ప్రధాని మోదీ తర్వాత స్థానం అమిత్ షాదేనని ‘సాధికారికం’గా నిరూపణ అయింది. ప్రభుత్వంలో ఆయన అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అవుతారన్న రాజకీయ పరిశీలకుల అంచనాలు నిజమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది కీలక మంత్రివర్గ సంఘాల్లో (కేబినెట్ కమిటీ)నూ అమిత్ షా ఉండటమే దీనికి నిదర్శనం. నీతి అయోగ్‌లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కూడా షాను నియమించారు. ఈ కమిటీల్లో కొన్నిటికి మోదీ, మరికొన్నిటికి అమిత్‌షా అధ్యక్షులుగా ఉన్నారు. దీన్నిబట్టి హోం మంత్రి అమిత్ షాకు మోదీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందీ తెలుస్తోంది. అయితే బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను కేవలం రెండు కమిటీలకు పరిమితం చేసినప్పటికీ గురువారం మరికొన్ని కమిటీల్లో స్థానం కల్పించింది. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి అధ్యక్షుడిగా కూడా కేంద్రం నియమించింది. గత ప్రభుత్వంలో ఆరు కమిటీల్లో ఉన్న రాజ్‌నాథ్ సింగ్ ఈ సారి కూడా ఆరు కమిటీల్లో ఉన్నారు. తాజాగా గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏడు కమిటీల్లో చోటు లభించింది. గత ప్రభుత్వంలో ఏర్పాటయిన ఆరు మంత్రివర్గ సంఘాలను ఇప్పుడు పునర్వ్యవస్థీకరించారు. వీటితో పాటు పెట్టుబడి, ఆర్థిక వృద్ధి, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలపై కొత్తగా రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. సీనియర్ ప్రభుత్వాధికారుల నియామకాలు, రాజ్యాంగ సంస్థల ఏర్పాటు వ్యవహారాలు చూసే కేబినెట్ కమిటీలో మోదీ, అమిత్ షాలు మాత్రమే ఉన్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఆర్థిక వ్యవహారాలు, భద్రత వ్యవహారాలు, కీలకమైన రాజకీయ వ్యవహారాలు తదితర కమిటీల్లో ఉన్నారు. ప్రధాని మోదీ అమిత్ షాను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో భవిష్యత్తులో ఆయనే చక్రం తిప్పుతారన్న వార్తలు వినవచ్చాయి. దానికి అనుగుణంగానే ముడి చమురు విషయమై రెండు రోజుల క్రితం జయశంకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్ సహా వివిధ కేంద్ర మంత్రులు నిర్వహించిన సమావేశాలకు అమిత్ షా అధ్యక్షత వహించారు. రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ జైట్లీ మాదిరిగానే సీతారామన్‌కు.. ఆరు కమిటీల పునర్వ్యవస్థీకరణలో ప్రభుత్వం గతంలో మంత్రిత్వ శాఖలకు ఇచ్చిన ప్రాధాన్యతనే ఇప్పుడూ ఇచ్చిందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఆరుణ్‌జైట్లీ అన్ని కమిటీల్లోనూ ఉన్నారు. ఇప్పుడా పదవి చేపట్టిన నిర్మల సీతారామన్‌కు కూడా అన్ని కమిటీల్లో స్థానం కల్పించారు. కొత్తగా ఏర్పాటు చేసిన రెండు కమిటీలకు ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్‌లకు కూడా పలు కమిటీల్లో స్థానం లభించింది. ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించే రాజకీయ వ్యవహారాల కమిటీలో అమిత్‌షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, నరేంద్ర తోమర్, రవిశంకర్ ప్రసాద్, రామ్ విలాస్ పాశ్వాన్ తదితరులు ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రధాన మంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి ప్రభుత్వంలో నెంబర్ టూగా వ్యవహరించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి ప్రధాని తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రాజ్‌నాథ్ సింగ్‌కు అమిత్ షాతో పోలిస్తే ఎక్కువ కమిటీల్లో చోటు దక్కక పోవడం విశేషం. -
‘దమ్ముంటే ప్రధాని అభ్యర్థిని ప్రకటించండి’
లక్నో: సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చివరి విడత లోకసభ ఎన్నికలు ఈనెల 19న జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కీలకమైన యూపీలో బీజేపీ, ఎస్పీ-బీఎస్పీ కూటమి ప్రచారంలో మునిగితేలుతున్నాయి. లక్నోలో పర్యటించిన కేంద్రం హోం శాఖమంత్రి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి రాజ్‌నాథ్ సింగ్ విపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. కూటమి నేతలకు దమ్ముంటే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని సవాల్ విసిరారు. లక్నోలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ మధ్య ఎన్నికల పోరు జరిగింది.ఈసారి ప్రతిపక్షాలకు సరైన ప్రధాని అభ్యర్థి కూడా లేరు. మోదీని ఎదుర్కొనే నాయకడు మీలో ఎవరు? ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి.. ఇంకా దాగుడు మూతలెందుకు.. దమ్ముంటే అభ్యర్థిని ప్రకటించండి’ అని అన్నారు. గత ఎన్నికల కంటే ఈసారి బీజేపీ జాతీయ స్థాయిలో మెరగైన ఫలితాలను సాధిస్తుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో కూడిన కూటమి పార్టీలపై ప్రజలకు నమ్మకంలేదన్నారు. -
‘పద్మ’ పురస్కారాల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: 2019 ఏడాదికిగానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో ఘనంగా జరిగింది. మొత్తం 112 మందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలు ప్రకటించగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తాజాగా 47 మందికి ప్రదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగిలిన వారికి ఈ నెల 16న అందజేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ‘రైతు నేస్తం’ వ్యవస్థాపక అధ్యక్షుడు యడ్లపల్లి వెంకటేశ్వరావు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.ప్రముఖ నటుడు మోహన్‌లాల్, అకాలీదళ్ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ దిండ్సా, బిహార్ నాయకుడు హుకుందేవ్ నారాయణ్ యాదవ్, ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ తరఫున ఆయన సతీమణి భారతి నయ్యర్ పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. గాయకుడు శంకర్ మహదేవన్, నటుడు ప్రభుదేవా, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్‌కమల్ తదితరులు పద్మశ్రీ పురస్కారాలు స్వీకరించారు. రైతాంగానికి నా పురస్కారం అంకితం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తనకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని తెలుగు రాష్ట్రాల రైతాంగానికి అంకితమిస్తున్నట్లు యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. అవార్డు అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు మరింత అవగాహన కల్పించేందుకు జిల్లాలు, మండలాల స్థాయిలో మోడల్ ఫాంలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ‘రైతు నేస్తం’ కృషి చేస్తుందని, సేంద్రియ వ్యసాయంలో రైతులకు శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేలా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ వసతి కూడా కల్పిస్తుందన్నారు. యువత కూడా వ్యవసాయం వైపు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పద్మ పురస్కారాల గ్రహీతలు ప్రభుదేవా, సామాజిక కార్యకర్త బంగారు అడిగలార్, శంకర్ మహదేవన్, శివమణి, మోహన్‌లాల్ -
తేడా వస్తే తాట తీయండి..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సరిహద్దుల్లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ శిక్షణ శిబిరాలపై భారత్ దాడి చేసిన అనంతరం దేశ భద్రతపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్‌లతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారత్–పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడితే సమర్థవంతంగా తిప్పికొట్టాలని హోం శాఖ ఆదేశించింది. ఇవిగో రుజువులు.. పుల్వామా దాడికి జైషే మహ్మదే కారణం న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో జైషే మహ్మద్ పాత్ర ఉందని చూపే ఆధారాలతోపాటు, పాక్‌లో నడుస్తున్న నిషేధిత ఉగ్ర సంస్థల వివరాలను భారత్ పాకిస్తాన్‌కు అందజేసింది. ‘పుల్వామా ఉగ్రదాడిలో జైషే మహ్మద్ హస్తం ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలతోపాటు ఆ ఉగ్ర సంస్థ నేతలు, స్థావరాల వివరాలను పాక్‌కు అందజేశాం’అని విదేశాంగ శాఖ తెలిపింది. పాక్ తన భూభాగంలో కొనసాగుతున్న ఉగ్ర కార్యకలాపాలను తక్షణమే అడ్డుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొంది. అమెరికా చేసిన పని మనమూ చేయగలం న్యూఢిల్లీ: భారత్‌పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను 2011లో అమెరికా దాడిచేసి మట్టుబెట్టిందని, భారత్‌కు అటువంటి సత్తా ఉందన్నారు. స్వచ్ఛగంగ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ లో మాట్లాడారు. ‘ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే నాకో విషయం గుర్తుకొస్తోంది. అబోటాబాద్‌లోని రహస్య స్థావరంలో దాక్కొన్న లాడెన్‌ను అమెరికన్ నేవీ షీల్స్ చాకచ క్యంగా మట్టుబెట్టగలిగినప్పుడు మనమెందుకు ఆ పని చేయలేం? గతంలో ఇటువంటి దా డులు కేవలం మన ఊహలకు మాత్రమే పరిమితమయ్యేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. శత్రువు ఎక్కడున్నా మట్టుబెట్టే సామర్థ్యం భారత్‌కూ ఉంది’అని జైట్లీ అన్నారు. -
వేర్పాటు నేతల భద్రత ఉపసంహరణ
శ్రీనగర్/జమ్మూ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వేర్పాటువాద నేతలకు కల్పించిన భద్రతతోపాటు ఇతర సౌకర్యాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే, జమ్మూకశ్మీర్ సమస్యపైగానీ, తమ భద్రతపైగానీ ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని హురియత్(వేర్పాటువాద పార్టీల ఐక్య వేదిక) పేర్కొనగా, వేర్పాటు వాద నేతలను అరెస్ట్ చేసి ఇతర రాష్ట్రాల జైళ్లకు తరలించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాగా, పుల్వామా ఘటన అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో జమ్మూలో శుక్రవారం విధించిన కర్ఫ్యూను సడలించేందుకు యంత్రాంగం ప్రయత్నాలు సాగిస్తోంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ప్రభుత్వం వేర్పాటువాదులపై కఠినచర్యలు తీసుకుంటోంది. వేర్పాటువాద పార్టీల నేతలకు కల్పించిన వ్యక్తిగత రక్షణను ఉపసంహరించుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించింది. హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌తోపాటు, అబ్దుల్ గనీ భట్, బిలాల్ లోన్, హషీమ్ ఖురేషి, ఫజల్ హక్ ఖురేషి, షబీర్ షా కలిపి మొత్తం ఆరుగురికి కేటాయించిన వ్యక్తిగత భద్రతా సిబ్బందితోపాటు వాహన సౌకర్యాలను సైతం ఆదివారం సాయంత్రం నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీరికి ప్రభుత్వపరంగా అందే ఇతర వసతులను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వీరు కాకుండా ఇంకా ఎవరైనా వేర్పాటు వాద నేతలకు ఇలాంటి వసతులు కల్పిస్తున్నట్లు గుర్తించినా వాటినీ తక్షణమే వెనక్కి తీసుకుంటామని పేర్కొంది. వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి భద్రతను కల్పించబోమని తెలిపింది. ఉమర్ తండ్రి మిర్వాయిజ్ ఫరూక్‌ను 1990లో, హురియత్ సీనియర్ నేత అబ్దుల్ గనీ లోన్‌ను 2002లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. అయితే, పాక్ అనుకూల వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా జిలానీ, జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్‌కు ప్రభుత్వం ఎలాంటి భద్రతను కల్పించలేదు. పాక్ నుంచి నిధులు అందుకుంటూ, ఐఎస్ఐతో అంటకాగుతున్న వేర్పాటువాద నేతలకు కల్పిస్తున్న రక్షణపై సమీక్షించాల్సి ఉందంటూ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం శ్రీనగర్ పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తమకు సంబంధం లేదన్న హురియత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కశ్మీర్ సమస్యపైగానీ, ఇక్కడి వాస్తవ పరిస్థితులపై గానీ ఎటువంటి ప్రభావం చూపబోదని హురియత్ పేర్కొంది. ‘మాకు పోలీసు రక్షణ ఉన్నా లేకున్నా పరిస్థితిలో మార్పుండదు. భద్రత కల్పించాలంటూ మేమెన్నడూ కోరలేదు. కొందరు నేతలకు హాని ఉందంటూ అప్పట్లో ప్రభుత్వమే భద్రత కల్పించింది. ఇప్పుడు ఉపసంహరించుకుంది. ఆ నిర్ణయంతో మాకు సంబంధం లేదు’ అని హురియత్ పేర్కొంది. వారిని వేరే రాష్ట్రాల జైళ్లకు తరలించాలి వేర్పాటువాద నేతలకు కల్పించిన భద్రతను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జమ్మూకశ్మీర్ బీజేపీ స్వాగతించింది. హురియత్ నేతలే కశ్మీరీల అసలైన శత్రువులని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మండిపడ్డారు. ఆ నేతలను అరెస్టు చేసి, జోథ్‌పూర్(రాజస్తాన్), తిహార్(ఢిల్లీ) జైళ్లలో పెట్టాలని డిమాండ్ చేశారు. జమ్మూలో మూడు రోజులుగా కర్ఫ్యూ పుల్వామా ఘటన అనంతరం శుక్రవారం జమ్మూ నగరంలో అల్లర్లు చెలరేగగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యంత్రాంగం విధించిన కర్ఫ్యూ కొనసాగుతోంది. కర్ఫ్యూను సడలించేందుకు అధికారులు వివిధ పక్షాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
దెబ్బకు దెబ్బ..!
భరతమాత కన్నీరు పెడుతోంది. కోట్లాది భారతీయుల గుండెలకు లోతైన గాయమైంది. మనల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేని కొందరు పిరికిపందలు చాటుమాటున నక్కి చేసిన దాడితో దేశానికి రక్షణగా నిలిచే వీరాధివీరులే నిర్జీవంగా నేలకొరిగిన దృశ్యాలు చూసి మనసు చలించిపోతోంది. కుట్ర కుతంత్రాలతో తన నీచ బుద్ధిని ఎప్పటికప్పుడు బయటపెట్టుకునే జిత్తులమారి దాయాది దేశానికి బుద్ధి చెప్పాలనే ఆరాటం, పగ , ప్రతీకారంతో భారతీయుల గుండెలు రగిలిపోతున్నాయి. ఇలాంటి సమయాల్లోనే కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతమే సరైనదే అనిపిస్తుంది.. అలాగంటే అదేదో యుద్ధోన్మాదం కాదు. అమరులైన వీర జవాన్లకు న్యాయం జరగాలి. భారతీయులు ఇప్పుడు కోరుకుంటున్నదదే. ఇక మీదట త్యాగాలకు విలువ లేదు. వాటికెప్పుడో కాలం చెల్లిపోయింది. మన దేశ సైనిక సత్తా, ఆర్థిక బలానికి కూడా కాలం చెల్లిపోయిందా ? పచ్చటి పచ్చికలపై పారే ఎర్రటి నెత్తురు మరకలు చూస్తుంటే మరిగిపోయిన రక్తం చప్పున చల్లారిపోతుందా? ఇంత నరకయాతనని కొద్ది రోజుల్లోనే మనం మర్చిపోతామా? కొన్ని వారాల్లోనే మళ్లీ సాధారణ మనుషులమైపోతామా? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో గెలిచి, ప్రజాప్రతినిధుల వేషాల్లో ఉన్నవారే ఉగ్రవాదులకు కొమ్ము కాస్తూ, బయటకి కల్లబొల్లి ఏడ్పులు ఏడుస్తూ ఉంటే, శాంతి నెలకొనాలన్న భారత్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఉంటే, కేంద్రం అడుగులు ఎటువైపు వేయాలి? ఇప్పుడు కశ్మీర్ భూతల స్వర్గం కాదు. మండుతున్న మంచుగోళం. శవాల దిబ్బల్ని చూసే ఓపిక లేదు. ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే సహించే పరిస్థితి లేదు. దాడి చూసాకైనా కేంద్రం సత్వర చర్యలు చేపట్టాలి. జాతి యావత్తూ అందుకోసమే ఎదురుచూస్తోంది. న్యూఢిల్లీ: ‘భారతీయుల రక్తం మరుగుతోంది. రోజూ వారీ ఖర్చులు వెళ్లదీయడానికి ఇతర దేశాల ముందు బిచ్చమెత్తుకుంటూ మన పొరుగుదేశం ఎంతో దిగజారింది. ఆ నిరాశ, నిస్పృహల ఫలితంగానే పుల్వామాలో దాడికి తెగబడింది. ఉగ్రవాదులపై ఎప్పుడు, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ఇదొక కొత్త సంప్రదాయం’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఉగ్రచర్యలతో భారత్‌ను పాకిస్తాన్ బలహీనపరచలేదని, పుల్వామా దాడికి బాధ్యులైన వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. మరోవైపు, పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యంత అనుకూల దేశం(మోస్ట్ ఫేవర్డ్ నేషన్–ఎంఎఫ్ఎన్) హోదాను భారత్ వెనక్కి తీసుకుంది. భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ సొహైల్ మహమూద్‌ను పిలిపించుకుని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే నిరసన వ్యక్తం చేశారు. పెద్ద తప్పు చేశారు..మూల్యం తప్పదు ఢిల్లీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపాక మోదీ మాట్లాడారు.‘ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులకు మద్దతునిస్తూ, వారిని ప్రేరేపిస్తున్న వారికి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా. వారు చాలా పెద్ద తప్పు చేశారు. ఈ దుశ్చర్యకు వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. పుల్వామా దాడికి పాల్పడిన, ఈ కుట్ర వెనక ఉన్న వారందరినీ కఠినంగా శిక్షిస్తామని దేశానికి హామీ ఇస్తున్నా. ఇప్పటికే అంతర్జాతీయంగా ఏకాకి అయిన మన పొరుగుదేశం ఉగ్రదాడులతో మన దేశంలో అస్థిరత సృష్టించాలని కుట్రలు పన్నుతోంది. కానీ వాళ్ల ప్రణాళికలు సఫలం కావు. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడానికి మన బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం’ అని అన్నారు. అనంతరం ఝాన్సీలో జరిగిన మరో సభలో ప్రసంగిస్తూ..పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వృథాగా పోదని పేర్కొన్నారు. ‘ ఉగ్రమూకల ఆటకట్టించేందుకు ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి వ్యూహం రచించాలో ఆ బాధ్యతను సైన్యానికే వదిలిపెట్టాం. ఇదే మన దేశ కొత్త విధానం, సంప్రదాయం’ అని పేర్కొన్నారు. అమరులకు మోదీ, రాహుల్ నివాళి పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల మృతదేహాలను వైమానిక దళ విమానం శుక్రవారం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది. హోం మంత్రి రాజ్‌నాథ్ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో అమరవీరుల భౌతికకాయాలను స్వీకరించారు. 40 శవపేటికలను పక్కపక్కన ఉంచారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు. ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాం: రాహుల్ భద్రతా బలగాలపై జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ఆత్మపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి తమ పూర్తి స్థాయి మద్దతునిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ‘దేశాన్ని రెండు ముక్కలుగా చేయాలన్న టెర్రరిస్టుల ఆశయం ఎన్నటికీ నెరవేరదు. మరో రెండు రోజులపాటు ఇతర విషయాలేవీ మాట్లాడదలచుకోలేదు’ అని తర్వాత మీడియా సమావేశంలో అన్నారు. ‘జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడమే మన మొదటి కర్తవ్యం. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదు. టెర్రరిజంపై ఐక్యంగా పోరాడాలి’ అని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. అత్యంత అనుకూల దేశం హోదా రద్దు దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఇచ్చిన ‘అత్యంత అనుకూల దేశం’(ఎంఎఫ్ఎన్) హోదాను భారత్ రద్దుచేసింది. ప్రధాని నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ భద్రతా కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై భారత్ కస్టమ్స్ సుంకాలు పెంచే చాన్సుంది. సుమారు 49కోట్ల డాలర్ల పాక్ ఉత్పత్తులపై ప్రభావం పడొచ్చు. పాక్‌కు అత్యంత అనుకూల దేశం హోదాను భారత్ 1996లో ఇవ్వగా, ఇంకా భారత్‌కు పాక్ ఆ హోదాను ఇవ్వలేదు. పాక్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో ప్రధానంగా ముడిపత్తి, నూలు, రసాయనాలు, ప్లాస్టిక్, రంగులు తదితరాలున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) సభ్యదేశాలు తమలో తాము వివక్షాపూరిత వాణిజ్య విధానాలు అవలంబించకుండా ఉండేందుకు ఎంఎఫ్ఎన్ హోదాను ఇచ్చిపుచ్చుకుంటాయి. ఈ హోదా కలిగిన దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులు, ఉత్పత్తులపై పన్నులు తక్కువగా ఉంటాయి. నివాళి కార్యక్రమంలో రాజ్‌నాథ్, నిర్మల, కేజ్రీవాల్, రాహుల్, సైన్యాధికారులు జమ్మూలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ప్రజలు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ -
పార్లమెంట్‌పైనా ప్రభావం
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో సీబీఐ, పోలీసు శాఖల మధ్య తలెత్తిన వివాదం ప్రభావం సోమవారం పార్లమెంట్ కార్యకలాపాలపై పడింది. మోదీ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోందంటూ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చేపట్టిన ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. అయితే, ఆ రాష్ట్రంలోని అసాధారణ పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన చర్య తీసుకునే కేంద్రానికి అధికారం ఉందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రతిపక్షం మూకుమ్మడి దాడి రాజకీయ విరోధులకు వ్యతిరేకంగా కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని లోక్‌సభలో టీఎంసీ సహా ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేయగా..ఇప్పటికే ఈ అంశం కోర్టులో ఉందంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ డిమాండ్‌ను తిరస్కరించారు. అనంతరం టీఎంసీ నేత సౌగత రాయ్ మాట్లాడుతూ.. ‘పశ్చిమబెంగాల్లో రాజకీయంగా పాగా వేసేందుకు కేంద్రం సీబీఐని వాడుకుంటోంది. ఇలాంటి ప్రయత్నాలను మేం తీవ్రంగా ప్రతిఘటిస్తాం’ అని అన్నారు. ‘ప్రతిపక్షాల అణచి వేతకు, నియంతృత్వ పాలన సాగించేందుకు సీబీఐను కేంద్రం అడ్డుపెట్టు కుంటోందని, ఈ చర్యలకు భయపడబోం’ అని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. మమతా ప్రభుత్వంతోపాటు కేంద్రం కూడా తప్పు చేస్తోందనీ, కుంభకోణాలపై సీబీఐ నాలుగేళ్లుగా ఎందుకు దర్యాప్తు చేయలేదని సీపీఎం నేత బదరుద్దోజా ఖాన్ ప్రశ్నించారు. అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతుండగా టీఎంసీ సభ్యులు చప్పుట్లు, నినాదాలతో అంతరాయం కలిగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డుతగలడంతో చైర్మన్ వెంకయ్య సభను మంగళవారానికి వాయిదా వేశారు. సమాఖ్య వ్యవస్థకు విఘాతం పశ్చిమబెంగాల్లో నెలకొన్న అనూహ్య పరిణామాలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ విషయమై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ‘పశ్చిమబెంగాల్లో జరిగిన ఘటన దేశ చరిత్రలోనే అసాధారణమయింది. అక్కడ రాజ్యాంగబద్ధ పాలన సాగడం లేదు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా తలెత్తిన అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దే అధికారం కేంద్రానికి ఉందని రాజ్యాంగం చెబుతోంది’ అని ఆయన అన్నారు. ‘చట్ట ప్రకారం తమ విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన సీబీఐ అధికారులను అడ్డుకోవటం దురదృష్టకరం. ఇలాంటి చర్యలు అరాచకానికి దారితీస్తాయి’ అని అన్నారు. రాజీవ్‌కుమార్ అధికారులకు సహకరించడం లేదన్నారు. తూర్పు భారతంలోని లక్షలాది మంది పేదలను మోసం చేసిన శారదా చిట్‌ఫండ్ స్కాంకు సంబంధించిన బాధితులు ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్ ప్రజలే. దీనిపై సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కుంభకోణంలో మనీల్యాండరింగ్, నల్లధనం, రాజకీయ నేతల ప్రమేయం వంటి అంశాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తంపైనా సీబీఐ దర్యాప్తు చేస్తోంది’ అని రాజ్‌నాథ్ తెలిపారు. -
రాజ్‌నాథ్ ప్రసంగాన్ని అడ్డుకున్న రామభక్తులు
లక్నో: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఉత్తర ప్రదేశ్‌లో చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గం లక్నోలో ఆదివారం పర్యటించిన ఆయనకు రామభక్తులు ఊహించని ఝలక్ ఇచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో రాజ్‌నాథ్ మాట్లాడుతుండగా.. ‘‘అయోధ్యలో రామమందిరం నిర్మించిన వారికే తాము ఓటువేస్తాం. వారినే ఎన్నుకుంటాం’’ అంటూ నినాదాలు చేశారు. ఆయన ప్రసంగానికి అడ్డుపడి ఒక్కింత ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో రాజ్‌నాథ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడున్న పోలీసులు కల్పించుకుని సంయమనం పాటించాలని కోరడంతో వారు వెనుక్కి తగ్గారు. -
ఎన్నికలప్పుడే ఆలయాల సందర్శన
బన్సుర్/జైపూర్: కాంగ్రెస్ నేతలు ఎన్నికలు సమీపించినప్పుడే ఆలయాల సందర్శనకు వెళతారని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నేతలు ఆలయాలు సందర్శించి పూజలు నిర్వహిస్తారు. మిగతా సమయాల్లో వాళ్లు ఆ చుట్టుపక్కల కూడా కనిపించరు. ఆలయాలు, గోవులు ఆ పార్టీకి ఎన్నికల ప్రచారాంశాలు కావొచ్చు. కానీ బీజేపీకి అవి సాంస్కృతిక జీవనంలో అంతర్భాగం’ అని రాజ్‌నాథ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో అవసరమైతే పాకిస్తాన్‌కు సాయం చేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ‘నేను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఒక్కటే చెబుతున్నా. అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వం తాలిబన్ ఉగ్రవాదులపై అమెరికా సాయంతో పోరాడుతోంది. పాక్‌లో ఉగ్రవాదులపై ఒంటరిగా పోరాడలేమని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం భావిస్తే భారత్ సాయం కోరవచ్చు’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భారత్–పాక్‌ల మధ్య కశ్మీర్ అన్నది సమస్యే కాదనీ, అది భారత్‌లో అంతర్భాగమని రాజ్‌నాథ్ పునరుద్ఘా టించారు. సర్జికల్ స్ట్రైక్స్ యూపీఏ హయాంలోనూ జరిగాయని కాంగ్రెస్ చెప్పడంపై స్పందిస్తూ.. ‘ఈ విషయాన్ని దేశప్రజలకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? సైన్యం అలాంటి సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి ఉంటే ప్రజలకు తెలిసేది కాదా? ఈ ఆపరేషన్‌ను ఎందుకు గోప్యంగా ఉంచారు? ఎవరికి భయపడ్డారు?’ అని రాజ్‌నాథ్ అన్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని అల్లాహ్ ఓడిస్తాడన్న ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ‘మతం, కులం ఆధారంగా చేసే రాజకీయాలపై మాకు నమ్మకం లేదు’ అని అన్నారు. -
దేవరకొండ: రాజ్‌నాథ్ రాకతో కమలదళం జోష్
సాక్షి, త్రిపురారం : వేలాదిగా తరలివచ్చిన జనంతో హాలియా మండల కేంద్రం కమలమయంగా మారింది. హాలియాలో శుక్రవారం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బహిరంగ సభ విజయవంతం కావడంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. హాలియాలోని దేవరకొండ రహదారికి సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభ జన సందోహంతో నిండిపోయింది. మహిళల కోలా టం, నృత్యాలతో బీజేపీ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపింది. ఈ సభకు పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని గ్రామగ్రామాల నుంచి ప్రజలు తరలివడంతో సభా ప్రాంగణమంతా నిండిపోయింది. రాజ్‌నాథ్‌సింగ్ సభకు రావడం ఆలస్యమైనప్పటికీ ప్రజలకు ఎలాంటి నిరుత్సాహం లేకుండా కళాకారులు తమ ఆటపాటలతో జోష్ నింపారు. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా పాడిన పాటలతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుతం అమలు చేస్తున్న పలు అభివృద్థి సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ కళాకారులు బృందం ఆటపాటలతో ప్రజలను అలరించారు. మరిన్ని వార్తాలు... -
సంయమనం పాటించండి: హోం మంత్రి
న్యూఢిల్లీ: తూత్తుకుడిలో ప్రజలు సంయమనం పాటించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనలో పోలీసుల కాల్పుల్లో ఇప్పటి వరకు 11 మంది నిరసనకారులు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం కూడా ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ తమిళనాడు ప్రజలు శాంతి, సంయమనం పాటించాలని కోరారు. ‘స్టెరిటైట్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో అమాయక ప్రజలు చనిపోవడం దురదృష్టకరం. వారి అత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న’ అని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం వ్యాఖ్యానించారు. కాగా నిరసనకారులపై కాల్పులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష డీఎంకేతో సహా ఇతర పక్షాలు శుక్రవారం తమిళనాడు బంద్‌కు పిలుపినిచ్చాయి. -
‘మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటాం’
సాక్షి, రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు జరిపిన ఎన్కౌంటర్లో ఆరుగురు రక్షణ సిబ్బంది మరణించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ స్పందించారు. మవోయిస్టులు అభివృద్ధికి వ్యతిరేకమని, వారు కేవలం రక్షణ సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటువంటి ఘటనలపై ప్రతీకారం తీర్చుకుంటామని రమణ్‌సింగ్ అన్నారు. మావోయిస్టులు వారి పోరాటం కంటే రక్షణ సిబ్బందిని చంపడంపైనే వారు దృష్టిసారించారని కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో విలేకరులతో మాట్లాడిన రాజ్‌నాథ్ ఘటనలో ఆరుగురు జవాన్లు మరణించడం దురదృష్టకరమన్నారు. -
ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చండి
-
భారత్ బలమైందని చైనాకు అర్థమైంది..
లక్నో: భారత్ బలహీన దేశం కాదని చైనా అర్థం చేసుకుంటోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ సరిహద్దులు పూర్తి సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో భారతీయ లోధి మహాసభ నిర్వహించిన కార్యక్రమానికి రాజ్‌నాథ్ హాజరై ప్రసంగించారు. చైనాతో నెలకొన్న సమస్య పరిష్కారమైందని తెలిపారు. భారత్‌ను విచ్ఛిన్నం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, మన భద్రతా దళాలు రోజూ ఐదు నుంచి పది మంది ఉగ్రవాదులను హతమార్చుతున్నాయని ఆయన పేర్కొన్నారు. -
వర్షాలతో రూ.2,200 కోట్ల నష్టం!
- కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు రాష్ట్రం నివేదిక సాక్షి, న్యూఢిల్లీ: వరద నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలో కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించనుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర మంత్రులకు హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదివారమిక్కడ రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇటీవలి వర్షాలకు సంభవించిన నష్టంపై నివేదిక అందించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. ‘‘మా విజ్ఞప్తిపై హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర బృందాలను పంపి, నష్టాన్ని అంచనా వేసి తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు’’ అని మహమూద్ అలీ చెప్పారు. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రూ.2,200 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, ఆ మేరకు రూపొందించిన ప్రాథమిక అంచనా నివేదికను రాజ్‌నాథ్‌కు అందజేశామని మంత్రి ఈటల తెలిపారు. ఇటీవలి వర్షాలతో హైదరాబాద్‌కు రూ.1,157 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రూ.463 కోట్ల మేర ఆర్అండ్బీ, రూ.298 కోట్ల మేరకు పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. మిడ్ మానేరుతో సహా 671 చెరువులకు గండి పడిందనివివరించారు. వర్షాలతో 46 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. -
18న విశాఖ రానున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్
విశాఖ: ఈ నెల 18న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విశాఖపట్నం రానున్నారు. ఆ రోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో ఆయన భేటీ కానున్నారు. రాత్రి విశాఖలోనే రాజ్‌నాథ్ సింగ్ బస చేయనున్నారు. మరుసటి రోజు 19న ఉదయం 10 గంటలకు బీఎస్ఎఫ్ హెలికాఫ్టర్‌లో కోరాపుట్‌కు రాజ్‌నాథ్ సింగ్ వెళ్లనున్నారు. -
'తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలి'
విజయవాడ: వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపాన్ని తెలియజేశారు. వరద బాధిత ప్రాంతాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోందని చెప్పారు. శనివారం విజయవాడలో గేట్ వే హోటల్లో ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ సదస్సుకు రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైఖ్య స్ఫూర్తిని సాధించడమే సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. అభివృద్ధి, ప్రగతిలో భాగస్వాములను చేయడమే దీని ఉద్దేశమని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఇది సరైన వేదికగా ఆయన పేర్కొన్నారు. దక్షిణాదిన తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్‌నాథ్ చెప్పారు. వామపక్ష తీవ్రవాదంతో అంతర్గత భద్రతకు సవాల్ ఎదురవుతోందని చెప్పారు. సరైన సహకారం, సమన్వయంతోనే వీటిని అదుపుచేయగలమని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
నేడు రాజ్‌నాథ్‌తో గవర్నర్ భేటీ
-
నేడు రాజ్‌నాథ్‌తో గవర్నర్ భేటీ
* కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు * ‘ఓటుకు కోట్లు’పై నివేదిక.. సెక్షన్-8పై చర్చించే అవకాశం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం ఢిల్లీ స్థాయిలో మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో తాజా పరిణామాలను చర్చించేందుకు కేంద్ర హోం శాఖ గవర్నర్‌ను ఢిల్లీకి పిలిపించింది. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశం కానున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ బేరసారాల్లో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయమున్నట్లు స్టీఫెన్సన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో అడ్డంగా దొరికిపోయిన బాబు.. తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేసిందంటూ ఎదురుదాడికి దిగారు. ఈ కేసులో గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రధానికి ఫిర్యాదు చేశారు కూడా. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సెక్షన్-8ను అమలు చేయాలని, శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించాలని కొత్త డిమాండ్ లేవనెత్తారు. ఇక ఈ కేసులో రేవంత్ అరెస్ట్ నుంచి వరుస పరిణామాలన్నింటినీ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు గవర్నర్‌కు నివేదించారు. ఇదే సమయంలో విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం గవర్నర్ ఈ కేసులో జోక్యం చేసుకోవచ్చంటూ అటార్నీ జనరల్ సలహా ఇచ్చినట్లు కథనం ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గవర్నర్ హడావుడి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించిన నివేదికతో పాటు ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన పలు అంశాలపై తన నివేదికలను గవర్నర్ హోంశాఖకు అందించనున్నట్లు సమాచారం. గవర్నర్‌తో సుజనా చౌదరి భేటీ సాక్షి, న్యూఢిల్లీ: ఇక్కడి ఏపీ భవన్లో బస చేసిన గవర్నర్ నరసింహన్‌తో గురువారం కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. వీరి సమావేశం గంట సేపు కొన సాగింది. ఓటుకు కోట్లు అంశం, సెక్షన్-8 అమలు, ఏసీబీ నోటీసులపై చర్చించినట్టు తెలుస్తోంది. సమావేశానంతరం సుజనా చౌదరితో మీడియా మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన నిరాకరిస్తూ వెళ్లిపోయారు. -
‘అత్యవసర’ మతలబు...
ఉరుములు, మెరుపులు లేకుండా, ఎలాంటి ముందస్తు సూచనలే కనిపించకుండా పిడుగు పడినట్లుగా అయ్యిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మళ్లీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ రావొచ్చునంటూ అద్వానీ ముందస్తు హెచ్చరికలు జారీచేయడం అలాంటిదేననే చర్చ జోరుగా సాగుతోంది. లలిత్‌మోదీ వ్యవహారంలో సుష్మాస్వరాజ్ ప్రమేయం బయటపడగానే, పీఎంఓ కార్యాలయం నుంచి మహాపాత్ర అనే అధికారిని సుష్మా ఇంటికి పంపించి ఈ కేసుకు సంబంధించిన వివరాలను మోదీ తెప్పిం చుకున్నారట. ఈ వార్త తెలిసిన వెంటనే కేంద్రమంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ స్పందిస్తూ సుష్మా ఎలాంటి తప్పు చేయలేదు, రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ సర్టిఫికెట్‌ను ఇచ్చేశారట. దీంతో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సైతం సుష్మాను వెనుకేసుకు రాక తప్పలేదట. ఆ తర్వాత లలిత్‌మోదీతో రాజస్తాన్ సీఎం వసుంధర రాజే కుమారుడికి వ్యాపార సంబం ధాలు, లలిత్‌మోదీకి అనుకూలంగా వసుంధర వ్యవహరించడంపై సైతం దుమారం రేగింది. ఆమె కూడా రాజీనామా చేసే పరిస్థితి రావొచ్చునంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కరితో ఇది ఆగకుండా పార్టీలో బలమున్న నేతలు, మంత్రుల విషయంలో ఇటువంటిదే ఏదో ఒకటి జరిగి అందరి పదవులకు ఎసరు రావొచ్చునని ముందుగానే జాగ్రత్త పడాల్సిన అవసరం ఏర్పడిందంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుష్మా, వసుంధర, మిత్రపక్షాల నేతలైన చంద్రబాబు, జయలలితతో సహా ఇటువంటి నేతలంతా మెల్లగా రాజ్‌నాథ్‌సింగ్ వెనకకు చేరుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిని గమనించే బీజేపీ కురువృద్ధుడు అద్వానీ ఎమర్జెన్సీ గురించి మాట్లాడాల్సి వచ్చిందని ఆ పార్టీనేతలే సూత్రీకరణలు చేస్తున్నారు. ఎంత పెద్దస్థాయి నాయకుడినైనా పక్కన పెట్టి మోదీ తన విధానాలతో ముందుకు సాగుతాడనేందుకు సంకేతాలుగానే ఎమర్జెన్సీ చర్చను బీజేపీ అగ్రనేత తెస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. కనీసం స్వపక్షంలోనే మోదీని ఎదుర్కునేలా రాజ్‌నాథ్‌సింగ్‌ను బలోపేతం చేసేందుకు కూడా ఇది జరుగుతోందని ఊహగానాలు సాగుతున్నాయి.