‘ఓటుకు కోట్లు’ వ్యవహారం ఢిల్లీ స్థాయిలో మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో తాజా పరిణామాలను చర్చించేందుకు కేంద్ర హోం శాఖ గవర్నర్‌ను ఢిల్లీకి పిలిపించింది. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశం కానున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే.