
లక్నో: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఉత్తర ప్రదేశ్‌లో చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గం లక్నోలో ఆదివారం పర్యటించిన ఆయనకు రామభక్తులు ఊహించని ఝలక్ ఇచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో రాజ్‌నాథ్ మాట్లాడుతుండగా.. ‘‘అయోధ్యలో రామమందిరం నిర్మించిన వారికే తాము ఓటువేస్తాం. వారినే ఎన్నుకుంటాం’’ అంటూ నినాదాలు చేశారు.
ఆయన ప్రసంగానికి అడ్డుపడి ఒక్కింత ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో రాజ్‌నాథ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడున్న పోలీసులు కల్పించుకుని సంయమనం పాటించాలని కోరడంతో వారు వెనుక్కి తగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment