తిరువనంతపురం: కేరళలో హీదర్ అనే నిర్మాణ కంపెనీ తమ బకాయిలను చెల్లించనందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మరికొంతమందిపై సివిల్ కేసు దాఖలుచేసింది. నెయ్యర్‌లో తాము నిర్మించిన రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ కాంప్లెక్స్‌కు రూ.2.8 కోట్లు బకాయిలు చెల్లించలేదని పేర్కొంది.
పిటిషనర్ తరఫు న్యాయవాది బాబూరాజ్ స్థానిక కోర్టులో ఇటీవల ఈ సివిల్ దావా దాఖలుచేశారు. కేపీసీసీ అధ్యక్షుడు వీఎం సుధీరన్, మాజీ సీఎం ఊమెన్ చాందీ, విపక్ష నేత రమేశ్ చెన్నితల, ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ హిదుర్ ముహమ్మద్‌లను కూడా ఈ దావాలో చేర్చినట్లు బాబూరాజ్ చెప్పారు.
సోనియాపై సివిల్ కేసు
Published Thu, Jun 9 2016 2:21 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement